
పోస్టర్ అతికిస్తే రూ. 17 వేలు ఫైన్
దుబాయ్: బహిరంగ ప్రదేశాలను పాడుచేసే వారికి భారీగా జరిమానాలు విధించాలని దుబాయ్ పాలకులు నిర్ణయించారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనల ప్రకారం ఎమిరేట్స్ అందాలకు భంగం కలిగించేవారిపై భారీ జరిమానాలు వడ్డిస్తారు. రోడ్డుపై ఉమ్మేసేవారికి 1000 దిర్హమ్స్(రూ.17,000) జరిమానా వేస్తారు. అనుమతి లేకుండా పోస్టర్లు అతికించినా అంతే వాత పడుతుంది.
సముద్రంలో చమురు లీకేజీకి కారణమైతే రూ. 51,000 మున్సిపల్ చెత్త వాహనాల్లో పురుగుమందుల క్యాన్లు పడేస్తే రూ. 85,000 జరిమానా విధిస్తారని 'ఖలీల్ టైమ్స్' పేర్కొంది.