
ఏడుపుగొట్టు హోటల్..
టోక్యో: వెక్కివెక్కి ఏడవడానికి ఓ హోటల్.. మీ మనసులో బాధంతా తీరిపోయేలా బోరుమనడానికో హోటల్. నిజం.. జపాన్‌లోని టోక్యోలో ఉన్న మిత్సుయ్ గార్డెన్ హోటల్ ఇలాంటి సదుపాయాన్నే కల్పిస్తోంది. అదీ మహిళలకు మాత్రమే సుమండీ. దీని కోసం ఆ హోటల్ ప్రత్యేకమైన గదులను కేటాయించింది.
ఇందులో ఏడుపొస్తే.. తుడుచుకోవడానికి ఖరీదైన టిష్యూలతోపాటు మనసును కదిలించేసి.. కన్నీళ్లు తెప్పించేసే సినిమాల డీవీడీలు ఉంటాయట. ఇక మీ ఇష్టమన్నమాట. కావాల్సినంత సేపు కన్నీరు పెట్టొచ్చు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని పొందాలంటే రోజుకు రూ.5300 చెల్లించాల్సి ఉంటుంది.