
కంటతడి పెట్టిన గాయని జానకి
హైదరాబాద్: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయానికి అంజలి ఘటించిన సందర్భంగా ప్రముఖ గాయని జానకి భావోద్వేగానికి గురయ్యారు. ఏడిద భౌతిక కాయాన్ని చూసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సతీమణిని తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులపాటు తనవద్దే ఉంచుకుంటానని చెప్పారు.