s janaki
-
నాకు మీ ప్రేమ చాలు ఇంకేమీ వద్దు..!
-
నేను మగవారి గొంతుతో కూడా పాడగలను..!
-
SP balasubrahmanyam: మైమరపించే గీతాలు
చిన్నప్పుడు సుశీల పాడిన పాటలు పాడి గుర్తింపు పొందారు బాలూ. గూడూరులో ఆయన ప్రతిభ గమనించి ‘సినిమాల్లో పాడు’ అని ప్రోత్సహించారు జానకి. కలిసి పాడి హిట్స్ ఇచ్చారు వాణి జయరాం. అన్నయ్యకు దీటుగా గొంతు సవరించుకున్నారు ఎస్.పి.శైలజ . ఒక రికార్డింగ్ థియేటర్లో బాలూతో బ్రేక్ఫాస్ట్–పాట, మరో థియేటర్లో లంచ్–పాట, మరో థియేటర్లో డిన్నర్ –పాట... ఇలా జీవితం గడిపారు చిత్ర. బాలు మరణించాక వస్తున్న తొలి జయంతి ఇది. జీవించి ఉంటే పుట్టిన్రోజు అనుండేవాళ్లం. ఎందరో మహిళా గాయనులతో పాటలు పాడి శ్రోతలను సేదదీర్చాడు ఆయన. ప్రతి గాయనితో కనీసం ఒక్కో యుగళగీతాన్ని తలుచుకునే సందర్భం ఇది. మావిచిగురు తినగానే (పి.సుశీల) ‘మావిచిగురు తినగానే కోవిల పలుకుతుందట.. కోవిల గొంతు వినగానే మావి– చిగురు తొడుగుతుందట’... తెలుగువారికి మావిచిగురుకి, కోయిలకి, కృష్ణశాస్త్రి కవిత్వానికి, సుశీల–బాలసుబ్రహ్మణ్యంల గొంతులకు ఉన్న అనుబంధం అవిభాజ్యం. ‘సీతామాలక్ష్మి’లో కె.వి.మహదేవన్ బాణీకట్టిన ఈ పాట రైల్వేస్టేషన్లో మొదలయ్యి పచ్చటి దారుల వెంట పరుగుతీస్తుంది. ‘బింకాలు బిడియాలు.. పొంకాలు.. పోడుములు’ అని సుశీల అంటే ‘ఏమో ఎవ్వరిదోగాని ఈ విరి గడసరి’ అని బాలూ అంటూ ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వు ఆయన సిగ్నేచర్. పాటల్లో ఆయన నవ్వుకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలివేణి ఆణిముత్యమా (ఎస్.జానకి) ‘స్వాతివాన లేతఎండలో... జాలి నవ్వు జాజిదండలో’ అని రాశారు వేటూరి. ఆ స్వాతివాన జానకి అయితే ఆ జాజిదండ బాలూ అయి ఉండవచ్చు. తెలుగు పాటల్లో ఇంత లోగొంతుకతో లాలిత్యంతో సున్నితంగా పాడిన మరొక పాట లేదు. ‘ముద్దమందారం’ సినిమా కోసం రమేశ్ నాయుడు స్వరకల్పనకు జానకి తో కలిసి బాలూ ఇచ్చిన ఆవిరి చిగురు... ఊపిరి కబురు కలకాలం నిలిచి ఉన్నాయి. ‘కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి నుదుటబొట్టు పెట్టనా... బొట్టుగా’ అని బాలూ అంటే దానికి జానకి ‘వద్దంటే ఒట్టుగా’ అని పరవశంగా చెప్పే జవాబు ఇక్కడ చదివితే తెలియవు. వినండి. ఎన్నెన్నో జన్మల బంధం (వాణీజయరాం) ఈ పాటలో పల్లవి, చరణాలు ఒకెత్తు. మొదటి చరణం తర్వాత వచ్చే ఆలాపనలు ఒకెత్తు. ‘హా’ అని బాలూ అంటే ‘హా’ అని వాణిజయరాం అంటే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆ..’ అని తీసే ఆలాపన అద్భుతం. బాలూ పాడిన ఉత్తమ పది డ్యూయెట్లు ఎవరు ఏవి ఎంచినా ఈ పాట ఉంటుంది. ‘నీవు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి చేరనా’ అని దాశరథి రాశారు. బాలూ–వాణి జయరాంల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అలా శ్రోతల హృదయజలధికి ఎప్పుడో చేరింది. మాటే మంత్రము (ఎస్పి.శైలజ) ‘నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే’ అని బాలూ పాడితే వెంటనే శైలజ ‘నేనే నీవుగా పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో’... అంటారు. ఏమి యుగళగీతం ఇది. ‘సీతాకోకచిలుక’కు వందల వర్ణాలు ఇచ్చిన యుగళగీతం. అన్నయ్య బాలూతో చెల్లెలు శైలజ ఎన్నో మంచి పాటలు పాడారు. కాని సంఖ్యా పరంగా చూస్తే పాడాల్సినన్ని పాడలేదు అనిపిస్తుంది. సొంత చెల్లెలైనా ఏనాడూ ఆమెను ప్రత్యేకంగా రికమండ్ చేయలేదు బాలూ. శైలజ తన ప్రతిభ తో రాణించారు. ‘పడమటి సంధ్యారాగం’లో ‘పిబరే రామరసం’, శుభసంకల్పంలో ‘సీతమ్మ అందాలూ’... ఈ అన్నాచెల్లెళ్లు కలిసి పంచిన తీపినిమ్మతొనలు ఎన్నని. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (ఎల్.ఆర్.ఈశ్వరి) ‘మరో చరిత్ర’లో ‘బలేబలే మగాడివోయ్’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరి, బాలూ కలిసి పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి దూకుడు ముందు నిలవడం తోటి గాయకులకు కష్టమే. కాని ఆమె సై అంటే బాలూ సై అనడం వీరిద్దరి పాటల్లో కనిపిస్తుంది. ‘సింహబలుడు’ కోసం వేటూరి రాయగా ఎం.ఎస్.విశ్వనాథన్ చేసిన ‘సన్నజాజులోయ్’ పెద్ద హిట్. ‘ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో’ అని అచ్చు ఎన్.టి.ఆర్ అన్నట్టే బాలూ అని మనల్ని మెస్మరైజ్ చేస్తారు ఈ పాటలో. పూసింది పూసింది పున్నాగ (చిత్ర) గాత్రాన్ని వెనక్కు నెట్టి బీట్ను ముందుకు తెచ్చిన 1990ల కాలంలో కీరవాణి రంగప్రవేశం చేసి మళ్లీ మాటను ముందుకు తెచ్చారు. ‘పూసింది పూసింది పున్నాగ’ అందుకు అతి పెద్ద ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. పచ్చటి చేలలో పిల్లగాలుల్లా మారడం ఈ పాటలో బాలూ, చిత్ర చేశారు. వేటూరి సాహిత్యం అందుకు తోడైంది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ వేదికయ్యింది. చిత్ర, బాలూ వేల పాటలు పాడారు. కాని ఈ పాట ఎప్పుడూ ప్రత్యేకమే. తెల్లచీరకు తకధిమి తపనలు (లతా) లతా మంగేశ్కర్ తెలుగులో బాలూతో పాడిన ఏకైక డ్యూయెట్. కె.రాఘవేంద్రరావు, ఇళయరాజాల వల్ల ఇది సాధ్యమైంది. లతాతో బాలూ హిందీలో ఎన్నో పాటలు పాడినా తెలుగులో ఇద్దరూ కలిసి పాడటం పాట ప్రియులకు పసందైన జ్ఞాపకంగా నిలిచింది. తెల్లచీరకు తపనలు వేటూరి తప్ప ఇంకెవరు రప్పించగలరు. వైశాఖం, కార్తీకం, ఆషాఢం, హేమంతం.. ఇవన్నీ ఈ పాట చరణాల్లో ఉంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాలే లతా మంగేష్కర్, బాలూ గళాలు కూడా. అందుకే ఆ అందం.. ఆ గంధం. ఓ వాలుజడా (సునీత) తెలుగువారికి వాలుజడ సత్యభామ కాలం నుంచి తెలుసు. దానిని ‘రాధాగోపాళం’లో పాటగా మలిచారు బాపురమణ. ‘అన్ని అందాలు స్త్రీలు ముందు ఉన్నా నువ్వొక్కదానివి వెనకెందుకున్నావు?’ అని కవి జొన్నవిత్తుల కొంటెగా వాలుజడను ప్రశ్నిస్తారు ఈ పాటలో. ఈ అచ్చతెనుగు పాటకు బాలూతో పాటు సునీత కాకుండా ఇంకెవరు గొంతు కలపగలరు. జీవితం సప్తసాగర గీతం (ఆశాభోంస్లే) ఈ పాటను ఆశా భోంస్లే మొదలెడతారు. మొదటి చరణం చివరలో బాలూ అందుకుంటారు. ‘హే... బ్రహ్మమానస గీతం.. మనిషి గీసిన చిత్రం.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట’... ఇలా పాడేవాళ్లు... ఇలా పాడగలిగినవాళ్లు ఎందరని? ‘చిన్నకృష్ణుడు’ కోసం ఆర్.డి. బర్మన్ చేసిన ఈ పాట వేటూరి మాటల్లో తాత్త్వికంగా ఉంటుంది. బాలూ, ఆశాభోంస్లే గొంతుల వల్ల లోతుగా ఉంటుంది. ‘జీవితం వెలుగు నీడల వేదం’ అని అంటారు వేటూరి. పాటకు ఒక వెలుగు బాలూ లేరు కదా. నీడగా ఆయన జ్ఞాపకమే ఉంది. జగదానందకారకా (శ్రేయా ఘోషాల్) బాలూ ఐదు దశాబ్దాలు పాడారు. పాతతరంతో ఎంత బాగా జోడీ కట్టారో కొత్తతరంలో కూడా అంతే దీటుగా గొంతు కలిపారు. శ్రేయా ఘోషాల్ దేశంలో ఒక ఉత్తమ యువ గాయని. కాని ఆమెతో ఈ డ్యూయెట్ లో బాలూ, శ్రేయా ఇళయరాజా గీతానికి ఎంత సౌందర్యం ఇచ్చారో... ఎలాంటి వాడని తోరణం కట్టారో... జొన్నవిత్తుల ఈ గీతం రాసి ప్రశంసనీయులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరో సోషల్ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్సెన్స్. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్ మీడియాని వాడొద్దు. ‘లాంగ్ లివ్ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్గా ఉన్నారు’. జెంటిల్మెన్ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్మెన్ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
వదంతులు నమ్మొద్దు: ఎస్ జానకి
మైసూర్: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు దిగ్గజ గాయని ఎస్ జానకి విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత సినీ గాయని ఎస్ జానకి ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో సంగీత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలను జానకి కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా తనపై వస్తున్న తప్పుడు వార్తలపై జానకి స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మైసూర్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఇటువంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఈ దిగ్గజ గాయని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) ‘జానకి గారికి ఇటీవలే ఓ ఆస్పత్రిలో చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. జానకి ఆరోగ్యంపై వదంతులను వ్యాప్తి చేయవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని జానకి కుటుంబ సభ్యులు, నటుడు మనోబాల వివరణ ఇచ్చారు. అంతేకాకుండా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సైతం ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో విడుదల చేశారు. ‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి నాకు 20 మంది వరకు ఫోన్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో జానకమ్మ చనిపోయారంటూ అసత్య వార్తలను వ్యాప్తి చేశారు. ఏంటి ఈ అర్థంపర్థం లేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు’ అంటూ ఎస్పీ బాలు పేర్కొన్నారు. (ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..) No...its wrong news..she got a minor operation..she s ok now https://t.co/3NuyV07eBF — manobala (@manobalam) June 28, 2020 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్-ఎస్ జానకి
-
నన్ను మోసం చేసి లాక్ చేశాడు
‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను..ఇవ్వనంటేనే వస్తానని సురేశ్కి ముందే చెప్పా. కానీ, నన్ను మోసం చేసి గానకోకిల ఎస్.జానకిగారి చేతులమీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్ చే సేశాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నా’’ అని హీరో చిరంజీవి అన్నారు. 16వ ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం’ ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సింగపూర్లో ఓ అవార్డుల కార్యక్రమంలో జానకిగారు, నేను కలిసాం. మళ్లీ ‘సంతోషం’ వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదుగా ‘సంతోషం’ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇందుకు సురేశ్కి థ్యాంక్స్. మరొకరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చుంటే తిరస్కరించేవాణ్ని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి గాయని ఎస్. జానకి మాట్లాడుతూ– ‘‘సురేశ్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్కు రావాలని అడుగుతున్నా కుదరక రాలేకపోయా. ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాల్లోని అప్పటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. ఆయన 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూసా. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్లగా సురేశ్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడుగారులాంటి వల్ల సాధ్యమైంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్బాబు, కె.ఎల్ నారాయణ, నటులు రాజేంద్ర పసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, ప్రసన్న, దర్శకుడు, నటుడు టి. రాజేందర్, రచయిత సాయిమాధవ్ బుర్రా, కథానాయికలు తమన్నా, మెహరీన్, ఈషా, స్నేహ, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి, నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా రాధాకృష్ణ, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
జానకికి బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం
సాక్షి, నెల్లూరు : ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణం తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందచేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ప్రముఖ గాయని ఎస్ జానకికి అందజేయనున్నారు. శ్రీ విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జానకమ్మ ఆశీస్సులతోనే ఇంత పెద్ద గాయకుడిని అయ్యా ఆమె సత్కరించుకనే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నా’నన్నారు బాలు. ఎన్నో అద్భుత గీతాలతో ప్రేక్షకులను అలరించిన జానకీ 17 భాషల్లో దాదాపు 45000 వేల పాటలు పాడారు. ఇందులో జపనీస్, జర్మన్ లాంటి విదేశీ భాషలు కూడా ఉండటం విశేషం. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 వివిధ రాష్ట్రాల అవార్డులు ఆమెను వరించాయి. 2016లో ఓ మలయాళ చిత్రానికి తన చివరి పాటను ఆలపించిన జానకీ తరువాత రిటైర్మెంట్ ప్రకటించారు. -
ఎస్.జానకి సంచలన నిర్ణయం
మైసూరు: ఎస్.జానకి.. ఈ పేరు వినని భారతీయులు అరుదు. ఆమె పాట అమృత ధార. సుమారు 6 దశాబ్దాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ వేలాది సినీ, భక్తి గీతాలు ఆలపించి గానకోకిలగా పేరు గడించిన జానకి సినిమాల్లో గానానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరి సారిగా కన్నడ చిత్రాల్లో ఆమె ఆలపించిన తనకిష్ట మైన పాటలు పాడి వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి అథితిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకిని సన్మానించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్ జానకి
-
'ఇదే నా చివరి పాట'
లెజెండరీ సింగర్ ఎస్ జానకీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. దాదాపు 60 సంవత్సరాలుగా 48 వేలకు పైగా పాటలతో సినీ సంగీత అభిమానులను అలరిస్తున్న జానకీ వయో భారం కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా తెలియజేశారు. చివరగా అమ్మాపోవిను అనే మలయాళ పాటను రికార్డ్ చేసిన జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ ప్రకటించారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకీ, 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. అయితే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం గాయనిగా కొనసాగటం లేదని మాత్రమే తెలిపారు. -
కంటతడి పెట్టిన గాయని జానకి
హైదరాబాద్: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయానికి అంజలి ఘటించిన సందర్భంగా ప్రముఖ గాయని జానకి భావోద్వేగానికి గురయ్యారు. ఏడిద భౌతిక కాయాన్ని చూసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సతీమణిని తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులపాటు తనవద్దే ఉంచుకుంటానని చెప్పారు. -
ఆ సినిమాలో పాత్ర ఎంతో సంతృప్తి నిచ్చింది
భీమవరం : సినీ గాయని ఎస్.జానకి సూచనతోనే గాయకుడినయ్యానని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ ప్రారంభ సభలో జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం చైతన్య భారతి, కాస్మోపాలిటిన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మాటాడుతా తీయగా’ పరిచయ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. 1962లో గుడివాడలో కాళిదాసు కళానికేతన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాటలు పాడిన సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చిన జానకి తనను పిలిచి సినిమాల్లో ప్రయత్నించాలని సూచించారన్నారు. ఇంజినీర్ కావాలని ఇంజినీరింగ్ చదివిన తాను జానకి సూచనతో గాయకుడిగా మారానని చెప్పారు. చిత్ర పరిశ్రమ తనకు అందించిన సహకారం మరువలేనన్నారు. పాటలకు న్యాయం చేయలేనని అనిపించినప్పుడు పాడటం మానేస్తానన్నారు. పాటలతోపాటు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాటలు, నాటకాలు రాయడం, ఫొటోలు తీయడం, ట్రావెలింగ్ తనకెంతో ఇష్టమన్నారు. మహ్మద్ రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పాటల రచరుుత ఆత్రేయ తనకు తండ్రిలాంటి వారని అన్నారు. 40 వేల పాటలు పాడా.. మిధునం సినిమాలో పోషించిన పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని బాలు తెలిపారు. ఇప్పటివరకు 40 వేల వరకు పాటలు పాడానని, వీటిలో నాలుగు వేల గీతాలు తనకెంతో ఇష్టమని చెప్పారు. బాల్యంలో ఆటపాటలు ముఖ్యమని చదువు కూడా అంతే అవసరమన్నారు. ర్యాంకుల కోసం పిల్లలను వేధించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటివరకు 66 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించానని చెప్పారు. జూనియర్ గాయకులను ఎందుకు ఎదగనివ్వడం లేదని ఒకరు ప్రశ్నించగా వారి ఎదుగుదలను ఆపడానికి తానెవరినని ముక్తసరిగా సమాధానమిచ్చారు. నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యంను గజమాలతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, గజల్ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా ఎదలో ఎదగా మసలే మనసుంటే జతగా నడిచే మనిషుంటే ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా చరణం : 1 ప్రేమకు లే దూ వేరే అర్థం (2) ప్రేమకు ప్రేమే పరమార్థం (2) ప్రేమించు ఆ ప్రేమకై జీవించూ నవ్వుతూ నవ్వించూ... ॥ చరణం : 2 ప్రతినదిలోనూ అలలుంటాయి (2) ప్రతి ఎదలోనూ కలలుంటాయి (2) ఏ కలలు ఫలియించునో శ్రుతిమించునో కాలమే చెబుతుందీ... ॥ గానం : ఎస్.పి.బాలు పల్లవి : ఊరించే వయసిదీ లాలించే మనసిదీ రేయంతా మేలుకొన్నదీ పగలంతా కలలు కన్నదీ నీకోసమే... తననా నననా నననా... ॥ చరణం : 1 రేపవలు ఒంటరితనము కనుమూయనీయదూ పడకింట నీదే తలపూ ఘడియాగనీయదూ రవ్వంత జాలితో కరుణించవా... హా... ఈ రాగవీణనూ పలికించవా... బదులేదిరా... తననా నననా నననా... ॥ చరణం : 2 కోరికలు తారకలైతే మనిషి బ్రతుకెందుకురా కోరింది తీరకపోతే బ్రతికి ఫలమేమిటిరా ఏ పూవు పూచినా జతమాలకే నేనేమి చేసినా నీ పొందుకే బదులేదిరా... తరరా తరరా తరరా... ॥ గానం : ఎస్.జానకి చిత్రం : వసంతకోకిల (1982) రచన : మైలవరపు గోపి, సంగీతం : ఇళయరాజా నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : పపగ పపగ పపగ పపగ... పపగ పస... పపగ పస... ఎదలో లయ ఎగసే లయ ససమా నినిరీ... ససమా నినిరీ... గగగ మమమ ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా చరణం : 1 గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోధనే నా జీవనం సాధనేలే జీవితం జతలే శ్రుతులై పలికే ఆలాపన వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ నాలో నేడే విరులవాన ॥ చరణం : 2 కోకిలగీతం... తుమ్మెదనాదం... (2) జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన... ఏకమైన ప్రేమగీతం... ఔనా... మైనా... నీవే... నేనా శుకపికముల కలరవముల స్వర లహరులలో పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస రిరిరిరి....నినినిని... సససస పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ ॥ సససస... సససస... చరణం : 3 విహంగమా... సంగీతమా... (2) సంగీతమే విహంగమై చరించగా స్వరాలతో వసంతమే జ్వలించగా ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో ॥ చిత్రం : అన్వేషణ (1985), రచన : వేటూరి సంగీతం : ఇళయురాజా, గానం : ఎస్.జానకి - నిర్వహణ: నాగేశ్