గీత స్మరణం
పల్లవి :
పపగ పపగ పపగ పపగ...
పపగ పస... పపగ పస...
ఎదలో లయ ఎగసే లయ
ససమా నినిరీ... ససమా నినిరీ...
గగగ మమమ ససస ససస ససస
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
శుకమా స్వరమా పికమా
పదమా శుకమా
చరణం : 1
గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
శోధనే నా జీవనం సాధనేలే జీవితం
జతలే శ్రుతులై పలికే ఆలాపన
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
నాలో నేడే విరులవాన ॥
చరణం : 2
కోకిలగీతం... తుమ్మెదనాదం... (2)
జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం
అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన...
ఏకమైన ప్రేమగీతం...
ఔనా... మైనా... నీవే... నేనా
శుకపికముల కలరవముల స్వర లహరులలో
పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస
రిరిరిరి....నినినిని... సససస
పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ ॥
సససస... సససస...
చరణం : 3
విహంగమా... సంగీతమా... (2)
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వసంతమే జ్వలించగా
ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో ॥
చిత్రం : అన్వేషణ (1985), రచన : వేటూరి
సంగీతం : ఇళయురాజా, గానం : ఎస్.జానకి
- నిర్వహణ: నాగేశ్