
మైసూరు: ఎస్.జానకి.. ఈ పేరు వినని భారతీయులు అరుదు. ఆమె పాట అమృత ధార. సుమారు 6 దశాబ్దాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ వేలాది సినీ, భక్తి గీతాలు ఆలపించి గానకోకిలగా పేరు గడించిన జానకి సినిమాల్లో గానానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరి సారిగా కన్నడ చిత్రాల్లో ఆమె ఆలపించిన తనకిష్ట మైన పాటలు పాడి వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి అథితిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకిని సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment