కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రాయపర్తి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపెల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా(35) గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ.. మద్యానికి బానిసై గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.