విప్రోకు ముఖ్య అధికారి గుడ్ బై
బెంగళూరు: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు ఒక ముఖ్య అధికారి గుడ్ బై చెప్పారు. గత కొన్నేళ్లుగా సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన చీఫ్ శిక్షణా అధికారి అభిజిత్ భాదురి తనపదవికి రాజీనామా చేశారు. ఆయన ఆధ్వర్యంలో సొంతంగా కొత్త కోచింగ్ ఇన్సిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
బెంగళూరు కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తున్న విప్రో విజయంతమైన గ్లోబల్ వెనక బదూరి కీలక సూత్రధారిగా పనిచేశారు. 2009లో సంస్థలో చేరిన బదూరి దాదాపు ఏడేళ్ల పాటు తన విశిష్టమైన సేవలందించారు. దీంతోపాటు గ్లోబల్ కోచ్ రామ్ చరణ్ , ఇన్నోవేషన్ గురు బిల్ ఫిషర్ వంటి విప్రో కు తీసుకొచ్చిన ఘనత ఈయనదే. విప్రో సంస్థలో లీడర్ షిప్ టాలెంట్ పెంపొందించే లక్ష్యంతో బదూరి నాయకత్వంలోనే ప్రముఖ ఐటీ సంస్థ వార్టన్ స్కూల్ తో ఒప్పందం జరిగింది. అంతకుముందు మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ డైరెక్టర్ ఉన్న బదూరి పెప్సీకో, కోల్గేట్, ముద్రా కమ్యూనికేషన్ సంస్థల్లో పనిచేశారు.