జస్ట్ ఎ మినిట్ మూవీ ఎలా ఉందంటే..?
టైటిల్: జస్ట్ ఎ మినిట్ నటీనటులు: అభిషేక్ పచ్చిపాల, ఇషిత సింగ్, వినీషా, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లినిర్మాణ సంస్థ: రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్నిర్మాతలు : రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు డా. ప్రకాష్ ధర్మపురిదర్శకత్వం: యశ్వంత్సంగీతం: ఎస్. కే. బాజీసినిమాటోగ్రాఫర్ : అమీర్ఎడిటర్ : దుర్గ నరసింహవిడుదల తేది: జులై 19, 2024‘జస్ట్ ఎ మినిట్’కథేంటంటే..రవి(అభిషేక్ పచ్చిపాల) ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. అది బయటకు చెప్పుకోలేని సమస్య. దాని నుంచి బయట పడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి పూజ(నజియా ఖాన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ అతని ఉన్న సమస్యను ఆమెతో షేర్ చేసుకోలేకపోతాడు. ఈ విషయంలో తన స్నేహితుడైన రాంబాబు(జబర్ధస్త్ ఫణి) సహాయం కోరతాడు. రవికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? ఆ సమస్య పూజకు తెలిసిన తర్వాత ఎలా ససోర్ట్గా నిలిచింది? చివరకు రవి ఆ సమస్యను అధిగమించాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ‘ఏడు చేపల కథ’అనే బోల్డ్ కామెడీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు హీరో అభిషేక్ పచ్చిపాల. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన బోల్డ్ కామెడీ జానర్‌తోనే ‘జస్ట్ ఎ మినిట్ ’అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ‘ఏడు చేపల కథ’లాగే ఇందులో కూడా హీరో ఓ శృంగార సమస్యతో బాధ పడతాడు. ప్రస్తుతం యువత చాలా వరకు ఈ సమస్యతో బాధపడుతుంది. ఈ విషయాన్ని కామెడీగా చూపిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు యశ్వంత్. అయితే ఆయన రాసుకున్న కథను తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అతనికిది తొలి సినిమానే. కొన్ని సీన్లను తెరకెక్కించిన విధానం చూస్తే.. అతని అనుభవ లేమి స్పష్టంగా తెలిపిసోతంది. అయితే కొన్ని కామెడీ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్ అంతా రవికి ఉన్న ఆరోగ్య సమస్యతో కామెడీగా సాగుతుంది. అయితే కొన్ని బోల్డ్ సీన్స్, సంభాషణలు ఓ వర్గానికి ఇబ్బందిగా అనిపించినా.. యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలిసిపోయేలా కథనం సాగుతుంది. నిడివి తక్కువ ఉండడం సినిమాకు ప్లస్ పాయింట్. థియేటర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ..ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యని కామెడీగా చూపించడంలో మంచి నటనను కనబరిచారు. హీరోయిన్ నజియా ఖాన్ పెర్ఫార్మెన్స్ గ్లామరస్ గా చాలా బాగుంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీ మరి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సారిపల్లి సతీష్ గారు తండ్రి క్యారెక్టర్ లో అలాగే పోలీస్ పాత్రలు కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు వారు బాగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఎస్.కె. బాజీ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.5/5