ఇరాక్ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి
ఇరాక్‌లో జరిగిన వివిధ హింసాత్మక ఘటనల్లో 44 మంది మృతి చెందారు. 133 మంది మృతి చెందారని పోలీసులు, అధికారులు తెలిపారు. బాగ్దాద్‌లోని షాలా ప్రాంతంలో ఉన్న ఓ పాపులర్ కేప్ సమీపంలో రోడ్డు పక్కన బాంబు పేలడంతో 3 ముగ్గురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు.
దక్షిణ బాగ్దాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో స్థానిక నాయకుడు, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆల్-డెబిస్ ప్రాంతంలో కారు బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. ఆబు సేదా పట్టణంలో ఇద్దరు రైతులను కాల్చి చంపారు. 12 కారు బాంబు పేలుళ్లతో సహా వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ఘటనల్లో కనీసం 31 మంది మృత్యువాత పడ్డారు. 95 మంది గాయపడ్డారు.