డిప్లమో కోర్సు నిర్వహణకు ఒప్పందం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్సు హెల్త్ ఆర్గనైజేషన్ కోర్సు నిర్వహ ణకు బొల్లినేని మెడిస్కిప్సు సంస్థతో మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, బొల్లినేని సంస్థ సెంటర్ హెడ్ సీహెచ్ నాగేశ్వరరావు, అకడమిక్ డెరైక్టర్ లక్ష్మీ శైలజ పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఏడాది కాలపరిమితి గల ఈ కోర్సు చదివేందుకు డిగ్రీ అర్హత. 35 ఏళ్లులోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 70 శాతం ప్రాక్టికల్, 30 శాతం థియరీ పద్ధతిలో ఉండే ఈ కోర్సు ఫీజు రూ.20 వేలు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో తరగతులు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర ప్రక్రియలను వర్సిటీ చేపట్టనుంది. ఈ ఏడాది నుంచే కోర్సు ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు.