Acne scars
-
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty Tips: పసుపు ఐస్‌క్యూబ్‌లతో.. మచ్చలు, వైట్ హెడ్స్, ట్యాన్ మాయం!
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల నీరసంగా వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్‌క్యూబ్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. ►టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పొడి, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. ►ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్ పోయి ముఖం ఫ్రెష్‌గా రేడియంట్‌గా కనిపిస్తుంది. ►చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. ► పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty Tips: బాదం పొట్టు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు!
బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టి, ఉదయం దానిమీద ఉండే పొట్టును తీసి తింటే మంచిదని చెబుతుంటారు. చాలా మంది అలాగే తింటుంటారు కూడా. అయితే, ఈ బాదం పొట్టును పడేయకుండా స్క్రబ్స్, హెయిర్ ప్యాక్స్, నైట్ క్రీమ్‌లు తయారు చేసుకుని వాడుకోవచ్చని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు. బాదం పొట్టులోని విటమిన్లు, ఖనిజపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ, కేశ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పొట్టుతో బ్యూటీ ఉత్పత్తులు తయారుచేసుకోవచ్చు. ఫేస్ స్క్రబ్ ►చర్మం ఆకృతిని మెరుగు పరిచే లక్షణాలు బాదం పొట్టులో పుష్కలంగా ఉంటాయి. ►కప్పు బాదం పొట్టును ఎండబెట్టాలి. ►కప్పు ఓట్స్, కప్పు శనగపిండి, కప్పు కాఫీ పొడిలో ఎండబెట్టిన పొట్టును వేసి గ్రైండ్ చేయాలి. ►ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ►వాడుకునేటప్పుడు ఈ పొడిలో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి పేస్టులా కలుపుకొని ముఖానికి అప్లై చేసి, మర్ధన చేసి తర్వాత కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇవి కూడా ట్రై చేయండి: Beauty Tips In Telugu: పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది! Hair Straightening Tips: కొబ్బరి నీళ్లు, ఆలివ్ ఆయిల్ ఉంటే చాలు! జుట్టు స్ట్రెయిటనింగ్ ఇలా! -
Beauty Tips: ముఖంపై మృతకణాలు తొలగిపోవాలంటే...
పెరుగు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మ సంరక్షణలోనూ అంతే మేలు చేస్తుంది. ముఖంపై కనిపిస్తోన్న మొటిమలను తగ్గించి, సహజసిద్ద మెరుపుని అందించడంలో పెరుగు బాగా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగించి కొత్తకణాల పుట్టుకలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ►పెరుగుని ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా కింద నుంచి పైకి మర్దన చేయాలి. ►పదిహేను నిమిషాలు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►రోజుమార్చి రోజు ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ►ఇక ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నయమవుతాయి.. ►అదే విధంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేసి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి.