ఆడ కూతురికి న్యాయం చేయండి
శృంగవరపుకోట: అత్తింటి ఆరళ్లకు బలైన ఓ ఆడకూతురికి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు రోడ్డెక్కా రు. స్థానిక వన్ వే జంక్షన్ వద్ద వారంతా బాధితురాలి అత్తింటి వారికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కట్నం తీసుకుని, పెళ్లి చేసుకుని తర్వాత అమ్మాయికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు అత్తింటి వారిపై దాడికి దిగారు. దీంతో పోలీ సులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ మొత్తం వ్యవహారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ సాగింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు...
పట్టణంలోని మునసబువీధికి చెందిన ఆడారి లావణ్యకు 2010లో వివాహం జరిగింది. అయితే భర్తతో సరిపడక కోర్డు ద్వారా విడాకులు తీసుకుంది. అ నంతరం ఆమెను వన్‌వే జంక్షన్‌కు చెందిన మళ్ల కుమార్ ఇష్టపడటంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం తో 2013మే 29న వివాహం జరిగింది. అయితే నాలుగు నెలల క్రితం లావణ్య ఆరోగ్యం బాగాలేదని అత్తింటి వారు ఆమెను పుట్టింటిలో దిగబెట్టారు. ప్రస్తుతం లా వణ్య రెండు కిడ్నీలు చెడిపోయాయి. కాళ్లు వాచిపోయి మంచం కదల్లేని స్థితిలో ఉంది. ఆమె భర్త మళ్ల కుమార్, కుటుంబ సభ్యులు విడాకుల కోసం ఒత్తిళ్లు తెస్తున్నార ని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని లావణ్య బంధువులు ఆరోపిస్తున్నారు.
దీనిపైనే ఇరు కుటుం బాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు కుటుంబాల మధ్య వాగ్యుద్ధమే జరిగింది. లక్షల రూపాయలు కట్నంగా తీసుకుని, ఇప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని కుమార్‌పైనా, అతని తల్లిదండ్రులు తాతబాబు, అచ్చియ్యమ్మ తదితరులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనతో వన్‌వే జంక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కుమార్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో లావణ్య బంధువులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక సీపీఎం నేతలు అంతా లావణ్యకు న్యా యం చేయాలంటూ వన్‌వే జంక్షన్ నుంచి స్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించి, స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
లావణ్య తల్లి ఆడారి పద్మ మాట్లాడుతూ పెళ్లినాటి ఒప్పందం మేరకు ముందు 1.5లక్షలు కట్నం, 15తులాల బంగారం, ఒక ఇల్లు, 1.20ఎకరాల భూమి ఇచ్చామని తెలిపారు. తర్వాత కూడా లక్ష రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. నాలుగు నెలల కిందట పిల్లకు ఒంట్లో బాగోలేదని చెప్పి పంపించేశారని, అమ్మాయికి మందు పెట్టి ఆరోగ్యం పాడు చేశారని ఆరోపించారు. ఆరు నెలల కిందట కూడా కిరోసిన్ పోసి చంపాలని చూశారని చెప్పారు. అప్పుడు ఎస్.కోట స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పెద్దలు రాజీ చేశారని తెలిపారు. ఇప్పడు తన కూతురి ఆరోగ్యం పాడైపోతే విడాకులు అడుగుతున్నారని, పోలీసులే న్యాయం చెప్పాలని అన్నారు.
కుమార్, అతని తల్లిదండ్రులు మాట్లాడుతూ... ‘రూ.1.5 లక్షల కట్నం, పొలం, ఇళ్లు, తొమ్మిది తులాల బంగారం ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏ తగువూ లేదు. ఈ మధ్య ఆరోగ్యం బాగోక అమ్మగారింటికి వెళ్తానంటే పంపాం. తర్వాత వాళ్లింటికి వెళ్తే మేము మందు పెట్టి పాడు చేశాం అని తిట్టడంతో వెళ్లటం మానేశాం. నిన్న పెద్దలు బంగారం తిరిగి ఇచ్చేయమన్నారు. బంగారం కుదువ పెట్టి వాళ్లు ఇచ్చిన ఇల్లు రిపేరు చేయించాం. సమయం కావాలని కోరాం. ఈ రోజు ఊహించని విధంగా మాపై దాడి చేసి ఇష్టానుసారం మమ్మల్ని కొట్టారు. నిందలు మోపారు. లావణ్యను మా ఇంటికి తీసుకెళ్లిపోవటానికి మాకు ఏ అభ్యంతరం లేదు’ అని చెప్పారు. దీనిపై ఎస్.కోట ఎస్ఐ ఎస్.కె..ఘనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.