కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి కన్నుమూత
ప్రముఖ కవీ, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్(80) బుధవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన ఇవాళ కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
విమర్శకుడిగా పేరుగాంచిన డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావ్ 1936 సెప్టెంబర్ 6న మచిలీపట్నంలో సుందర్ రావ్, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. సముద్రం నానేల, కాలం మీద సంతకం, పొగ చూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం లాంటి కవితా సంపుటాలు, శ్రీశ్రీ కవితా ప్రస్థానం కుందుర్తి కవితా వైభవం 'అభ్యుదయ విప్లవ కవితలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు' మొదలైన విమర్శా గ్రంథాలు వెలువరించారు.
60 ఏళ్ళ సాహితీ ప్రస్థానంలో అనేక వ్యాపాలు కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఆయన సాహితీ కృషిని గుర్తించి బోయి భీమన్న అవార్డు, తిలక్ పురస్కారం, తమిళనాడు చిన్నప్ప భారతి అవార్డు, నాగభైరవ అవార్డులు ఆయనను వరించాయి.
ప్రపంచీకరణను వ్యతిరేకించిన తొలి తెలుగు కవి రామ్మోహన్ ఆయనే. కవిత్వం, విమర్శ ఆయనకు రెండు కళ్లు. 25కు పైగా కవితా సంకలనాలు. 600కు పైగా కవితా సంకలనాలకు ముందు మాటలు రాశారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని సమీక్షించిన తొలి విమర్శకులు రామ్మోహన్. ఆధునిక కవిత్వం సిద్దాంతాలు, చింతరీతులు అంశాలపై ఆయన చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పొందారు.