ఆదిశేషు బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు డిస్టిలరీస్‌లో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న మామిళ్లపల్లి ఆదిశేషు బినామీ ఇంటిలో ఆదివారం ఏసీబీ సోదాలు జరిగాయి. నాలుగు రోజులుగా ఆదిశేషు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీపాండురంగస్వామి వారి ఆలయం పక్కన ఉన్న ఆదిశేషు సమీప బంధువు మామిళ్లపల్లి ఏడుకొండల వెంకటసుబ్బారావు ఇంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ సెంట్ర ల్ టీం డీఎస్పీ ఎ.అనూరాధ, ఇన్స్పెక్టర్ సుదర్శనరెడ్డి సోదాలు నిర్వహించారు. సుమారు రూ.రెండు కోట్ల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, టాబ్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అనూరాధ మాట్లాడుతూ ఆదిశేషు అక్రమాస్తులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారాన్ని 9440446130 నంబర్‌కు తెలపాలని కోరారు. సోదాలలో ఏలూరు ఏసీబీ సీఐ యు.విల్సన్ సహకరించారు.