వరంగల్ సహకార బ్యాంక్ పాలక వర్గం రద్దు
వరంగల్: వరంగల్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసింది. ఇటీవల ఈ బ్యాంకు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వడంతో బ్యాంకు పాలకవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఇంచార్జిగా నియమించింది.