ప్రకటనల ఆదాయంలో సగం.
సాక్షి, ముంబై: సొసైటీ భవనాలపై ఏర్పాటుచేసే మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని సభ్యులు కూడా పొందేలా నియమాల్లో మార్పులు చేయనున్నట్లు సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వెల్లడించారు. ఇదివరకు ఇలాంటి నిబంధన లేకపోవడంతో ప్రకటనలతో వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీలు భవనాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నాయి.
అయితే వాటి లెక్కలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. నిధుల్లో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయనే చెబుతున్నారు. అంతేగాక ప్రకటనల ఆదాయంపై సొసైటీలు ఆడిటింగ్ కూడా జరిపిం చడం లేదు. అందుకే వీటికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని పాటిల్ అభిప్రాయపడ్డారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తం గా 88,433 రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి.
ఈ భవనాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థ లు, దుకాణాలు ఉన్నాయి. వేలాది సొసైటీలు తమ భవనాలపై మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసేందుకు అనుమతించాయి. ఫలితంగా ఇవి నెలకు అద్దె రూపంలో లక్షలాది రూపాయలు పొందుతున్నాయి. ఇక నుంచి ఈ నిధులు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. ఇక నుంచి నిధు ల్లో 50 శాతం మొత్తాన్ని నివాసులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయాలి.
మిగతా 50 శాతం నగదును సొసైటీ నిర్వహణకు వెచ్చించాలని చట్టాన్ని రూపొంధించనున్నట్లు పాటిల్ చెప్పారు. మొబైల్ టవర్లు, ప్రకటన బోర్డు లు ఏర్పాటుకు అనుమతినిచ్చే ముందు భవనానికి స్ట్రక్చరల్ ఆడిట్ కచ్చితంగా చేయించాలి. ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న లేదా జంక్షన్ల వద్ద ఉన్న భవనాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
ఇక్కడ హోర్డింగులు ఏర్పాటుచేయడానికి వాణిజ్య సంస్థలు పోటీ పడతాయి. అందుకు ఎంతై నా చెల్లించడానికి ముం దుకువస్తాయి. కానీ వీటిని ఏర్పాటు చేయడంవల్ల భవనాలపై అదనపు భారం పడుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. అదనంగా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు సొసైటీ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. దీంతో విచ్చలవిడిగా టవర్లు, హోర్డింగులు వెలుస్తున్నాయి. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం సొసైటీలను ఆదేశించింది.