అహ్మద్ ఖాద్రీ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: అహ్మద్ ఖాద్రీ (125 బంతుల్లో 105, 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కడంతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) భారీ స్కోరు చేసింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా బీడీఎల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆదివారం ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 98.2 ఓవర్లలో 472 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఖాద్రీ సెంచరీ పూర్తిచేయగా, బీడీఎల్ బౌలర్లలో రాజత్ రమేశ్ 5 వికెట్లు తీశాడు. శివ శంకర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బీడీఎల్ ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. నవీన్ రెడ్డి 42, విశాల్ జూడ్ ఫిలిప్స్ 34, యతిన్ రెడ్డి 33 పరుగులు చేశారు. ఎస్బీహెచ్ బౌలర్ అల్ఫ్రెడ్ అబ్సొలమ్ 3, రవికిరణ్, విశాల్ వర్మ, అశ్విన్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.
ఏఓసీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈఎంసీసీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు 277/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఈఎంసీసీ 105.4 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. సూర్యతేజ (189 బంతుల్లో 99, 14 ఫోర్లు) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఏఓసీ 58.5 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఇర్ఫాన్ ఖాన్ (63), ధనాజీరావు (52) అర్ధసెంచరీలు చేశారు. ఈఎంసీసీ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిఖిల్ దీప్ 6 వికెట్లు తీశాడు. అనంతరం ఈఎంసీసీ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది.