Ahsan Khan
-
ఇల్లు పొమ్మంది... నెట్టిల్లు రమ్మంది
నగరం నడిబొడ్డున ఓ చింపిరి జుట్టు, బవిరి గడ్డం బిచ్చగాడు మీకు ఎదురుపడి గ్లామర్ తగ్గని, గ్రామర్ తప్పని ఇంగ్లీష్‌లో మాట్లాడితే మీకెలా ఉంటుంది? కాలేజీ ప్రొఫెసర్లకు అసూయ తెప్పించే ఇంగ్లీష్‌లో వ్యంగ్యాలు, హాస్యాలు, కవితలు, చమత్కారాలు వరుసగా వినిపిస్తే మీరేమవుతారు? పాక్ నటుడు అహసాన్ ఖాన్‌కి కరాచీ డిఫెన్స్ మార్కెట్లో అలాంటి ఓ యాభై ఆరేళ్ల వృద్ధ యాచకుడు తగిలాడు. ‘డబ్బులొద్దు... ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి’ అని ఆ వృద్ధ్ధుడు ఇంగ్లీష్‌లో అడిగేసరికి ఖాన్ డంగైపోయాడట. ఒకప్పుడు బాగా బతికిన అతడి కారును.. రెండు డంపర్లు ముందు నుంచి, వెనక నుంచి ఢీకొట్టి నుజ్జు నుజ్జు చేశాయి. ఈ ప్రమాదంలో భార్య, ఏడుగురు పిల్లలు చనిపోయారు. ఇతను ఆస్పత్రిలో ఉండగా అన్నదమ్ములు ఆస్తిని దోచేసి, గెంటేశారు. కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు. అహసాన్ అతని వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. వేలాది మంది నెటిజన్లు స్పందించారు. ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంప్యూటర్ సంస్థ అయితే అతనికి ఉద్యోగమూ, క్వార్టర్స్ ఇచ్చింది. ప్రపంచం రాజును పేద చేసేసింది. కానీ నెట్ ప్రపంచం కటిక పేదను మళ్లీ మారాజును చేసేసింది. -
సోషల్ మీడియాలో తాజా సంచలనం
-
సోషల్ మీడియాలో తాజా సంచలనం
ప్రపంచవ్యాప్తంగా సినీనటులకుండే క్రేజ్, సోషల్ మీడియాలో వాళ్ల ప్రభావం బోలెడంత! అయితే వాళ్లలో కొందరు మాత్రమే.. సినిమా ప్రమోషన్లకో, వ్యక్తిగత పాపులారిటీకో కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటారు. పాకిస్థానీ నటుడు అహసాన్ ఖాన్ లాగా. రెండు రోజుల కిందట కరాచీలోని డిఫెన్స్ మార్కెట్ ప్రాంతానికి వెళ్లిన ఖాన్‌కు ఓ వృద్ధుడు తారసపడ్డాడు. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డంతో యాచకుడిలా కనిపించిన అతనికి అంతోఇంతో ఇవ్వబోయాడట ఖాన్. 'డబ్బులొద్దు. ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి' అని ఆ వృద్ధుడు ఇంగ్లీష్ లో అడిగేసరికి ఖాన్ డంగైపోయాడట! వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి ముసలాయను ఇంటర్వ్యూచేశాడు. స్వచ్ఛమైన బ్రిటిష్ ఇంగ్లీష్, మధ్యమధ్యలో హాస్యోక్తులు, అక్కడక్కడా హిందీ షాయరీలతో సాగిన ఇంటర్వ్యూను హీరో ఖాన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టించింది. కారు ప్రమాదంలో భార్య సహా ఏడుగురు పిల్లల్ని పోగొట్టుకున్న ఆ లాహోర్ వృద్ధుణ్ని అన్నదమ్ములు మోసం చేసి ఇంటి నుంచి గెంటేశారట. దిక్కుతోచని స్థితిలో కరాచీకి వచ్చి, అక్కడే ఓ ఇంటి వసారాలో ఉంటున్నాడట. కంప్యూటర్లు తప్ప మిగతా ఏపనైనా సరే ఇట్టే చేసేస్తానన్న వృద్ధుడి మాటలకు ఫిదా అయిన వేల మంది నెటిజన్లు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. పాక్ లో పేరుమోసిన 'ఆమ్ టెక్ సిస్టమ్స్' అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అయితే ఏకంగా ఓ క్వార్టర్స్ ఇచ్చిమరీ పనిలో పెంట్టుకుంటానని ప్రకటించింది. ఇలా పేరున్న నటుడి ఫేస్ బుక్ పోస్ట్ తో అనాథ వృద్ధుడి ఆకాంక్ష నెరవేరింది. 'బీయింగ్ హ్యుమన్' బ్రాండ్ అంబాసిడర్ కాకున్నా మీ హ్యుమానిటీ ప్రశంసనీయం' అంటూ అహసాన్ ఖాన్ ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.