Air balloons
-
నిద్రమత్తులో డ్రైవర్.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!
సాక్షి, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 565పై రోడ్డుప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ కారును నడిపించడంతో.. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రైలింగ్‌ను దాటి.. పల్టీలు కొడుతూ.. పంటపొల్లాలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారు పూణే నుంచి కనిగిరి మండలం మాచవరంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. -
ప్రాణాలు కాపాడిన ఎయిర్ బెలూన్స్
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు తృటిలో త ప్పిన ప్రమాదం చంద్రగిరిః కారులోని ఎయిర్ బెలూన్స్ వారికి శ్రీరామ రక్షగా నిలిచాయి. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు...తాడేపల్లిగూడెంకు చెందిన ఫణికుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఫణికుమార్ రెండు రోజుల క్రితం భార్య విజయ దుర్గ, కుమారుడు సుజన్‌తో కలసి తాడేపల్లిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. ఆదివారం రాత్రి వారు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మండలంలోని పూతలపట్టు-నాయుడు పేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో వేలూరు నుంచి తిరుమలకు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఫణికుమార్ వాహనాన్ని ఢీకొని, రోడ్డుపక్కనే ఉన్నటువంటి గొయ్యిలో బోల్తా కొట్టింది. బస్సు ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఫణికుమార్ సీటు బె ల్టు ధరించడంతో కారులో బెలూన్ ఓపెన్ అయ్యి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విజయదుర్గ వెన్నుముకకు తీవ్ర గాయమవ్వడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఎస్సై కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.