విజేతలు జితేష్, హుమేరా
సాక్షి, హైదరాబాద్: బీబీఆర్ హాస్పిటల్ ఏఐటీఏ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ (అండర్-16)లో జితేష్ స్వామి, షేక్ హుమేరా విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని పల్లవి ప్లే గ్రౌండ్స్‌లో సూర్య టెన్నిస్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది.
బాలుర ఫైనల్లో ఐదో సీడ్ జితేష్ స్వామి (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-3 స్కోరుతో తీర్థ శశాంక్ (ఏపీ)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో షేక్ హుమేరా (ఏపీ) 6-4, 6-4 తేడాతో ఏడో సీడ్ అమినేని శివానిని ఓడించింది. విజేతలకు ఏపీ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు రాజా నరసింహారావు, బీబీఆర్ హాస్పిటల్ డెరైక్టర్ బి. సందీప్ బహుమతులు అందజేశారు.