మా అమ్మాయి 'ఆ' పాట పాడటం ఇబ్బందిగా ఉంది
లాస్ ఏంజిల్స్: తాను పాడిన పాటను తన కూతురు కూడా పాడితే.. ఏ తండ్రికైనా ఆనందం కలుగుతుంది. కానీ అమెరికన్ సింగర్ ఏజే మెక్ లియాన్ మాత్రం తన మూడేళ్ల కూతురు అవా తన పాటను పాడుతుంటే ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్'తో ఫేమస్ అయిన ఈ గాయకుడు.. తన ఆల్బంలోని 'సెక్స్' అనే పాటను తన కూతురు అవా పాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉందని తెలిపాడు.
'తనకు సంగీతమంటే చాలా ఇష్టం. తను పాడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. కానీ తనకు ఇష్టమైన పాట 'సెక్స్'. ఆ పాటలోని ప్రతి పదం తనకు తెలుసు. అందులోని అర్థం తెలియకపోయినా తను తరచూ పాడుతుంది. తను ఆ పాట పాడుతుంటే.. 'దేవుడా.. వద్దు' అనాలన్న భావన కలుగుతుంది. తన నోటి నుంచి ఆ పాట వింటుంటే కొంచెం ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుంది' అని మెక్లియాన్ చెప్పాడు.