ప్రేమను కూడా అమ్మేస్తాడా?
దేన్నయినా అమ్మేయగల సమర్థుడు ఆ యువకుడు. ఒకానొక దశలో తన ప్రేమను కూడా అమ్మేయాల్సివస్తుంది. ఇలాంటి ఆసక్తికర కథాంశంతో నవీన్చంద్ర, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. అజయ్ వొద్దిరాల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కె.రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అనురాగ్ కెమెరా స్విచాన్ చేయగా, సుకుమార్ క్లాప్ ఇచ్చారు. టి.ప్రసన్నకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
‘ఆర్య’ నుంచి ‘ఆర్య-2’ వరకూ తన వద్ద అజయ్ సహాయకునిగా పనిచేశాడని, తనది అద్భుతమైన జడ్జిమెంట్ అని సుకుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. వాణిజ్య అంశాలను మేళవించిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కించనున్నానని దర్శకుడు చెప్పారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మించనున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. కొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తన పాత్ర ఎనర్జి టిక్గా ఉంటుందని నవీన్ చంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రతీష్ వేగా, పాటలు: సిరివెన్నెల.