అజ్మీర్ దర్గా పేలుళ్లు దోషులకు జీవితఖైదు
జైపూర్: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఇద్దరు దోషులు భవేష్ పటేల్, దేవేంద్ర గుప్తాలకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం యవజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2007 అక్టోబర్‌లో అజ్మీర్ దర్గాలో బాంబు పేలుళ్లు సంభవించాయి. రంజాన్ పర్వదినం ఇఫ్తార్ సమయంలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. కాగా స్వామి అసిమానంద సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులుగా తేలిన ముగ్గురిలో సునీల్ జోషి మరణించగా, దేవేంద్ర గుప్త, భావేష్ పటేల్‌కు ఇవాళ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికీ ముగ్గురు నిందితులు పరారీలోనే ఉన్నారు.