బాలుడిని తీవ్రంగా గాయపరిచిన కుక్కలు
కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలులోని అజుముద్దీన్ నగర్లో బుధవారం చోటుచేసుకరుంది. స్థానికంగా నివాసముంటున్న బాలుడు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.