భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి?
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్టులు ఎదురు పడినట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. అయితే, అకాబీడా ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసి పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సమావేశంలో 50 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నారంటున్నారు.
ఈ విషయం తెలిసి పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు వెళ్లి కాల్పులు జరిపారని, ఇందులో 12 మంది అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు. మరికొంతమంది కూడా గాయపడ్డారని, వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియలేదని చెబుతున్నారు. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 8 మంది జవాన్లు మరణించడంతో.. దానికి ప్రతీకారంగానే తాజా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మందుపాతర ఘటన ఈనెల రెండో తేదీన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సును లక్ష్యంగా ఎంచుకొని ముందాభూమి వద్ద కల్వర్ట్ను పేల్చివేయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, మరో 25మంది వరకు గాయపడినట్లు సమాచారం.