ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్టులు ఎదురు పడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, అకాబీడా ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్న విషయం తెలిసి పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సమావేశంలో 50 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నారంటున్నారు.