కథ విని ఎగై్జట్ అయ్యాను – రాంకీ
‘‘ఇటీవల తెలుగులో సినిమా చేయడానికి వీలు కుదరకపోవడం, మంచి సినిమా అవకాశం రాకపోవడం కారణాలు. ‘ఆకతాయి’ కథను రామ్‌భీమన వినిపించి నప్పుడు ఎగై్జట్ అయ్యాను. కథ నచ్చడంతో ఒప్పుకున్నా’’ అని నటుడు రాంకీ అన్నారు. ఆశిష్‌రాజ్, రుక్సార్‌మీర్ జంటగా రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన చిత్రం ‘ఆకతాయి’.
మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను రాంకీ విడుదల చేశారు. ‘‘2013లో ‘హమ్ తుమ్’ సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ‘ఆకతాయి’ చేశా. ఈ చిత్ర నిర్మాతలు అడక్కుండానే నాకు వరాలు ఇచ్చారు’’ అని దర్శకుడు అన్నారు.