మాజీ లవర్‌తో నటి డేటింగ్?!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజాగా ఓ హ్యాండ్సమ్ యువకుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. వైరల్‌గా మారిన ఈ ఫొటోల్లో ఉన్న ఆ యువకుడు ఎవరని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతను ఎవరో కాదు ఆలియా మాజీ ప్రియుడు అలీ దదార్కర్. ఈ ఫొటోల్లో ఆలియా బెస్ట్ ఫ్రెండ్ అకాంక్ష రంజన్ కూడా ఉంది.
యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆలియా ప్రేమలో మునిగిపోయిందని ఆ మధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరికి బ్రేకప్ అయిందట. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ సైతం చెప్పకనే చెప్పేశారు. అంతేకాకుండా ఈ మధ్య 'జెంటిల్మన్' సినిమాలో తనతోపాటు నటించిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ సన్నిహితంగా ఉంటున్నాడట. సినిమాలోనూ, సినిమా ప్రమోషన్‌లోనూ ఈ ఇద్దరి మధ్య బాగా కుదిరిన కెమిస్ట్రీ కూడా రూమర్స్‌కు తావిచ్చింది. ఇది ఇలా ఉండగా ఆలియా ఇలా మాజీ ప్రియుడితో కనిపించడంతో గాసిప్ రాయుళ్లకు పని కల్పించింది. ఆలియా-అలీ గతంలో డేటింగ్ చేశారు. అంతకుమించి అలీ గురించి పెద్దగా వివరాలు తెలియదు. అతనితో ఆలియా చక్కర్లు కొడుతున్న ఫొటోలు మాత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
Bffs !