పాతబస్తీలోని పల్లె చెరువుకు గండి
హైదరాబాద్: పాతబస్తీలో బండ్లగూడ పల్లెచెరువుకు గండి పడింది. చెరువుకు గండి పడి రోడ్డుపైకి భారీగా నీరు వచ్చి చేరడంతో నాలుగు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టుప్రాంతాలు జలమయమైయ్యాయి. ఆలీనగర్ బస్తీ ఇళ్లు నీటమునిగాయి. మోకాళ్ల లోతులో బస్సు నీట మునగడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
స్థానికులు, పోలీసులు బస్సును ఒడ్డుకు చేర్చి ప్రయాణికులను రక్షించినట్టు తెలిసింది. దీనిపై అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.