కొలిక్కి వచ్చిన ‘సకల’ వేతనం చర్చలు
సెప్టెంబర్ 10, 11 తేదీల్లో డ్యూటీలో ఉండి, 12న సెలవులో ఉన్న, గైర్హాజరైన 3,741 మందికీ వర్తింపు
17వ తేదీన రూ.14కోట్ల చెల్లింపునకు నిర్ణయం
గోదావరిఖని(కరీంనగర్) : గని కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనం చెల్లింపు విషయమై బుధ, గురువారాలలో గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్) యాజమాన్యం తో చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరగగా 13న విధులకు హాజరైన 33,541 మంది కార్మికులకు మాత్రమే సమ్మె కాలపు వేతనం చెల్లిం చనున్నట్లు సంస్థ సర్క్యులర్ విడుదల చేసింది.
అదే సమయంలో 12వ తేదీ నుంచి సెలవులో ఉన్న, విధులకు గైర్హాజరైన కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని అందులో పేర్కొంది. దీంతో గుర్తింపు సంఘంతో పాటు మిగతా కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యం లో గుర్తింపు సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఇతర నాయకులు సింగరేణి సీఎండీ, ఇతర అధికారులతో హైదరాబాద్లో చర్చలు జరిపారు. ఫలితంగా సర్క్యులర్లో ఉన్న నిబంధనను తొలగించి 2011 సెప్టెంబర్ 10, 11 తేదీల్లో డ్యూటీలో ఉండి 12 తేదీ సెలవులో ఉన్న, విధులకు గైర్హాజరైన 3,741 మంది కార్మికులకు సైతం ‘సకల’ వేతనం చెల్లించడానికి యాజమాన్యం ముందుకు వచ్చింది. వీరికి ఈనెల 17న రూ.14 కోట్లు బ్యాంకు ఖాతాలలో జమచేయనున్న ది.
ఇదిలా ఉండగా సమ్మె సమయంలో అత్యవసర విధు లు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది, ఎస్అండ్పీసీ గార్డు లు, గనులలో పంప్డ్రైవర్లు, ఎలక్రీ్టషియన్లు, ఫిట్టర్లతో పాటు ధీర్ఘకాలిక సెలవులో, యాక్సిడెంట్ రిపోర్టులో, మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని విధులకు దూరంగా ఉన్నవారు, సిక్ అయి విధులు నిర్వహించని వారికి సమ్మె వేతనం అందలేదు. వీరికి ప్రత్యేక గుర్తింపు గా జ్ఞాపికను అందజేయాలని కార్మిక సంఘాలు యాజ మాన్యాన్ని కోరుతున్నాయి.