టీడీపీ - బీజేపీ పొత్తు ముక్కలు చెక్కలు
సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ముక్కచెక్కలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కమలనాథులు మండిపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నాయకులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా..మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు తెలిపారు.