Alltime reocrd
-
ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు నైట్ ఫ్రాంక్ నరెడ్కో సర్వేలో వెల్లడైంది. వచ్చే ఆరు నెలల కాలానికి సైతం బుల్లిష్‌గా ఉన్నట్టు డెవలపర్లు వెల్లడించారు. ఇళ్లకు, వాణిజ్య ప్రాజెక్టులకు డిమాండ్ బలంగా ఉండడంతో ప్రస్తుత, భవిష్యత్తు సెంటిమెంట్ ఇండెక్స్ నూతన రికార్డు స్థాయికి చేరినట్టు నైట్‌ఫ్రాంక్–నరెడ్కో విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్’ తెలియజేసింది. ప్రస్తుత సెంటిమెంట్ (డెవలపర్ల వైఖరి) నూతన గరిష్ట స్థాయి 68కి చేరుకోవడం డెవలపర్లు వారి ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలియజేస్తోందని ఈ సర్వే నివేదిక తెలిపింది. భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు కూడా రికార్డు స్థాయిలో 75కు చేరింది. వచ్చే ఆరు నెలల కాలానికి కూడా డెవలపర్లు, ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 50కు పైన స్కోరును ఆశావాదంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థంగా, 50కు దిగువన నిరాశావాదంగా పరిగణిస్తారు. రానున్న రోజుల్లో మరింత జోరు ‘‘ప్రస్తుత సెంటిమెంట్ స్కోరు 2021 నాలుగో త్రైమాసికంలో 65గా ఉంటే, 2022 మొదటి మూడు నెలల్లో 68కి పెరిగింది. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ మంది భాగస్వాములకు గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో సానుకూలంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూడో విడతను అధిగమించింది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి ప్రభావాలేవీ రియల్ ఎస్టేట్ మీద చూపించలేదు’’అని ఈ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తుతో స్తబ్దుగా మారిన వాణిజ్య రియల్ ఎస్టేట్ కూడా వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది. కరోనా ప్రొటోకాల్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసినందున రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ మంచి జోరు చూపించొచ్చని నివేదిక అంచనా వేసింది. ‘‘నివాస గృహాల మార్కెట్లో వృద్ధి ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ రంగం అంతటా సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. చాలా కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బజాజ్ తెలిపారు. -
RBI policy: ఫ్లాట్‌గా మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో కాస్త తడబడిన సూచీలు వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 101 పాయింట్లు ఎగిసి 52334 వద్ద, నిప్టీ 29 పాయింట్ల లాభంతో 15720 వద్ద సరికొత్త గరిష్టానికి చేరాయి. ఆర్బీఐ మరికొద్ద సేపట్లో తన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. దాదాపు కీలక వడ్డీరేట్లను యథాయథంగానే ఉంచనుందన్న అంచనాల మధ్య దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్జిసి, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలలో ఉన్నాయి. నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్), ఎస్బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఆర్ఐఎల్ స్టాక్స్ నష్టపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఈ ఉదయం 10 గంటలకు ద్రవ్య విధాన ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయిలో 226 లక్షల కోట్లకు చేరుకుంది. ఇటీవలి రికార్డు స్థాయి మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో గురువారం నాటికి మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .2,26,51,439.68 కోట్లుగా ఉంది. గురువారం ఒక్కరోజే 1,88,767.14 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం విశేషం. చదవండి: దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! -
మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్ యెల్లన్ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి. ఫలితంగా సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్ షేరు 18% లాభపడగా, ఎంఆర్ఎఫ్ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. ► భారత్‌లో తయారయ్యే తన ఎస్యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్ ఉత్పత్తితో పాటు ఎగుమతులను ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది. ► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్బీఐ కార్డ్స్ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. -
ఆద్యంతం లాభాలే: నిఫ్టీ రికార్డు ముగింపు
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో బుల్ దౌడు ఎలాంటి బ్రేకులు లేకుండా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా కీలక సూచీలు రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరింత ఉత్సాహంగా స్పందించాయి. ట్రేడింగ్ మొదట్లోనే సెన్సెక్స్ 38,938 వద్ద, నిఫ్టీ 11,760ను ఆల్ టైం గరిష్టాలను తాకింది. అనంతరం స్వల్పంగా వెనక్కి తగ్గినప్పటికీ రోజంతా లాభాల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 202 పాయింట్లు జంప్‌చేసి 38,896 వద్ద , నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి తొలిసారి 11,700కి ఎగువన( 11,738) ముగిసింది. మెటల్, ఐటీ, ఆటో రంగాలు పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ కౌంటర్లు నష్టపోయాయి. హిందాల్కో, ఆర్ఐఎల్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, అదానీ పోర్ట్స్, వేదాంతా, మారుతీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, యాక్సిస్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. . అయితే గెయిల్ యస్‌బ్యాంక్, హెచ్‌పీసీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐషర్, గ్రాసిమ్, యూపిఎల్, బజాజ్ ఫిన్ నష్టపోయాయి. -
సరికొత్త రికార్డు స్థాయికి నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది. రెండు సూచీలు సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేశాయి. నిన్న సిల్వర్ జూబ్లీ చేసుకున్న సెన్సెక్స్ శుక్రవారం కూడా అదే జోష్ లో దూసుకుపోయింది. సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ మరింత పైకి ఎగిసింది. 376 పాయింట్లు పెరిగి 25,396 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీగా లాభపడింది. 109 పాయింట్లు పెరిగి 7,583 వద్ద ముగిసింది. దేశీ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే ముందే చాలావేగంగా పుంజుకోవచ్చన్న సంకేతాలు బలపడుతుండటం... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న అంచనాలు దేశీ మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి.