సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో బుల్ దౌడు ఎలాంటి బ్రేకులు లేకుండా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా కీలక సూచీలు రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరింత ఉత్సాహంగా స్పందించాయి. ట్రేడింగ్ మొదట్లోనే సెన్సెక్స్ 38,938 వద్ద, నిఫ్టీ 11,760ను ఆల్ టైం గరిష్టాలను తాకింది. అనంతరం స్వల్పంగా వెనక్కి తగ్గినప్పటికీ రోజంతా లాభాల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 202 పాయింట్లు జంప్‌చేసి 38,896 వద్ద , నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి తొలిసారి 11,700కి ఎగువన( 11,738) ముగిసింది.
మెటల్, ఐటీ, ఆటో రంగాలు పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లు నష్టపోయాయి. హిందాల్కో, ఆర్‌ఐఎల్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, అదానీ పోర్ట్స్, వేదాంతా, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, యాక్సిస్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. . అయితే గెయిల్ యస్‌బ్యాంక్, హెచ్‌పీసీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐషర్, గ్రాసిమ్, యూపిఎల్, బజాజ్ ఫిన్ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment