డబ్బు కోసం కాదు
ప్రొఫెషనల్‌గా మారడంపై విజేందర్
ముంబై : అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ప్రొఫెషనల్‌గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. 15 ఏళ్లపాటు అమెచ్యూర్ బాక్సర్‌గా కొనసాగిన తాను ఇష్టపూర్వకంగానే ప్రొఫెషనల్‌గా మారినట్టు ఈ హర్యానా బాక్సర్ వివరించాడు. ‘డబ్బు కోసం నేను ప్రొఫెషనల్‌గా మారలేదు. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. కాంస్య పతకం కూడా సాధించాను. ప్రొఫెషనల్‌గా మారేందుకు నాకో అవకాశం లభించింది. దానిని సద్వినియోగం చేసుకుంటున్నాను’ అని బుధవారం ప్రొఫెషనల్ట్రైనింగ్ ప్రారంభించిన విజేందర్ చెప్పాడు.