కదిలివచ్చిన వంశ వృక్షం
దాచేపల్లిలోని అంబటి వంశీకులైన సుమారు 70 కుటుంబాలకు చెందిన 350 మందికి పైగా భట్రుపాలెం ఘాట్లో పుష్కర స్నానమాచరించారు. కృష్ణమ్మ తల్లికి నమస్కరించి పసుపు, కుంకుమ, చీరెలు నదిలో వదిలిపెట్టారు. అనంతరం పితరులకు పిండప్రదానం చేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఘాట్ వద్దే సహపంక్తి భోజనాలు చేశారు. – భట్రుపాలెం (దాచేపల్లి)