టెన్నికాయిట్ చాంప్ అంబర్పేట్ పీజీ
జీహెచ్ఎంసీ సమ్మర్ క్రీడలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ సమ్మర్ క్రీడల్లో టెన్నికాయిట్ ఓవరాల్ టీమ్ టైటిల్‌ను అంబర్పేట్ ప్లేగ్రౌండ్స్ (ఏపీజీ) జట్టు చేజిక్కించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో శనివారం జరిగిన బాలబాలికల టీమ్ టైటిళ్లను అంబర్పేట్ పీజీ జట్లు గెలుచుకున్నాయి. బాలుర సింగిల్స్ వ్యక్తిగత టైటిల్‌ను మధుసూదన్ (ఏపీజీ) గెలుచుకోగా, బాలికల సింగిల్స్ టైటిల్‌ను అశ్వని (ఏపీజీ) గెలిచింది.
బాలుర సింగిల్స్ ఫైనల్లో మధుసూదన్ 21-18, 20-22, 21-19తో తరుణ్ (ఏపీజీ)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో మధుసూదన్ 21-18, 21-16తో హరికృష్ణ (గౌస్‌మండి)పై, తరుణ్ 21-16, 21-18తో లీన్ (గౌస్‌మండి)పై నెగ్గారు. బాలికల సింగిల్స్ ఫైనల్లో అశ్వని 21-18, 21-19తో గౌతమి (ఏపీజీ)పై గెలిచింది.సెమీఫైనల్లో అశ్వని 21-18, 21-19తో రాణి(గౌస్‌మండి)పై, గౌతమి 21-12, 21-19తో శాలిని (గౌస్‌మండి)పై గెలిచింది.
సెపక్తక్రా విజేత విజయనగర్ పీజీ
సెపక్తక్రా బాలుర టీమ్ టైటిల్‌ను విజయనగర్ పీజీ జట్టు నెగ్గింది. బాలికల టీమ్ టైటిల్‌ను హిందూనగర్ పీజీ జట్టు గెలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్(వీపీజీ) ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర విభాగం ఫైనల్లో విజయనగర్ పీజీ 15-11, 12-15, 15-13తో హిందూనగర్ పీజీపై గెలిచింది. సెమీస్‌లో విజయనగర్ పీజీ 15-12, 9-15, 15-10తో వీపీజీపై, హిందూనగర్ పీజీ 15-13, 15-13తో మల్లేపల్లి పీజీపై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్లో వీపీజీ 15-11, 16-14తో గోల్కొండపై, విజయనగర్ పీజీ 15-10, 15-12తో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌పై, హిందూనగర్ పీజీ 15-13, 15-13తో పీఎస్నగర్పై నెగ్గాయి.
కబడ్డీ బాలుర విభాగం: గౌలిపురా పీజీ 17-12తో సబ్జిమండి పీజీపై, కేశవ్‌గిరి 26-11తో ఏకే భవన్‌పై, తాళ్లగడ్డ పీజీ 20-11తో యూసుఫ్‌గూడ పీజీపై, హనుమాన్ నగర్ పీజీ 25-20తో జియాగూడ పీజీపై, గౌలిపురా ఓంకార్ పీజీ 21-15తో పీజేఆర్ స్టేడియంపై, పటేల్ పీజీ 26-18తో కేపీహెచ్‌బీ-7పై గెలిచాయి.