ఐటీ అధికారులమంటూ వచ్చి... దోచుకు పోయారు
తిరుపతి : చిత్తూరు జిల్లా నాగులాపురంలో దోపిడి దొంగలు గురువారం తెల్లవారుజామున హల్చల్ చేశారు. ఐటీ అధికారులమంటూ స్థానిక అంబికా జ్యూయలర్స్లోకి చొరబడ్డారు. అనంతరం యజమానిని బంధించి... దోపిడికి పాల్పడ్డారు. షాపులోని దాదాపు రూ. 7 లక్షలు విలువైన నగలతోపాటు రూ. 5 వేలు నగదు అపహరించి... అక్కడ నుంచి పరారైయ్యారు.
గురువారం ఉదయం షాపు యజమాని బిగ్గరగా అరవడంతో స్థానికులు స్పందించి.... యజమాని కట్లు విప్పారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.