American Corner
-
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు
ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు. స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు. "అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్ పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్‌లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి. సాధారణంగా షార్క్‌లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. A kayaker was fishing over a mile offshore in Windward Oahu, Hawaii, when a tiger shark slammed into his boat. https://t.co/d0QzzJODZT pic.twitter.com/P7GStEQvRx — CNN (@CNN) May 16, 2023 -
విదేశీ విద్యకు రాచబాట
సాక్షి, అమరావతి: విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయి. ప్రధానంగా అమెరికాలో చదవాలనుకునే వారికి రాష్ట్రం నుంచి రాచబాట సిద్ధమైంది. స్టెమ్ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు) విద్య, మహిళా సాధికారత, అమెరికన్ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించే వేదిక ‘అమెరికన్ కార్నర్’ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటైంది. దేశంలోనే ఇది మూడవది కావడం గమనార్హం. తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై సూచనలు, సలహాలు.. మరెన్నో విధాలుగా సేవలందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు చుక్కానిగా నిలవనుంది. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఈ కార్నర్ ఏర్పాటయ్యేందుకు కృషి చేసిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్‌కు, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత జిల్లాకు చెందిన మహిళ వీణారెడ్డి అమెరికాలో ఉన్నతమైన పదవిలో ఉండటం సంతోషం కలిగిస్తోందన్నారు. ఇవాళ ప్రారంభమైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి.. మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖపట్నంలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యమని, దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నానని ఆకాంక్షించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్–అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షను నెరవేర్చడంలో అమెరికన్ కార్నర్ వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం పర్యటన తనకెన్నో అనుభూతులను మిగిల్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి జోయల్ రీఫ్‌మన్, వీణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కుమార్ అన్నవరపు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికన్ కార్నర్ ఉపయోగాలిలా.. ► విశాఖలో ఏర్పాటైన అమెరికన్ కార్నర్ దేశంలో మూడవది. ఇప్పటి వరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో మాత్రమే పని చేస్తున్నాయి. ► విశ్వవిద్యాలయాలు, కోర్సులు, ఫీజుల వివరాలు, ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, ఆహారం, వసతి సౌకర్యం తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందజేస్తుంది. ► ఇక్కడ అన్ని సేవలు ఉచితంగా అందుతాయి. ► విదేశాల్లో విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు మార్గదర్శిగా నిలుస్తుంది. ► ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్న రెండు ప్రభుత్వాల (రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం) ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్య భూమిక పోషించనుంది. ► ఆంగ్లంలో నైపుణ్యం పెంచే దిశగా సీఎం వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌తో విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. వీరందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలిస్తూ సహాయకారిగా నిలుస్తుంది. ► ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రయోజనకారి. -
విశాఖ ఏయూలో 'అమెరికన్ కార్నర్' ప్రారంభం
-
‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్,హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఆప్షన్–3 ఎంచుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్ 25 నుంచి మొదలవ్వాలి