సీసీఎంబీ యాక్టింగ్ డెరైక్టర్‌గా చటోపాధ్యాయ
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) యాక్టింగ్ డెరైక్టర్‌గా ప్రొఫెసర్ అమితబా ఛటోపాధ్యాయ నియమితులయ్యారు. ఈ మేరకు సీసీఎంబీ మాతృసంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అధ్యక్షుడి హోదాలో ప్రధాని నరేంద్రమోడీ ఛటోపాధ్యాయ నియామక ఉత్తర్వులు జారీచేశారు.
డాక్టర్ సీహెచ్ మోహనరావు ఈ ఏడాది జనవరి 31న పదవీ విరమణ చేయడంతో ఔట్‌స్టాండింగ్ సైంటిస్ట్‌గా ఉన్న ప్రొఫెసర్ ఛటోపాధ్యాయ సీసీఎంబీ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతోపాటు జేసీబోస్ నేషనల్ ఫెలోషిప్ పొందిన డాక్టర్ ఛటోపాధ్యాయ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ, ఇండియన్ అకడమీస్ ఆఫ్ సెన్సైస్ సభ్యుడిగానూ ఉన్నారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో ఛటోపాధ్యాయ దాదాపు 200 పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.