Ammonium
-
ఇళ్లు తగులబడకుండా ‘గులాబీ పౌడర్’
ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు బుధవారం కూడా కొనసాగుతోంది. అటవి శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలు అంటుకోకుండా అడ్డుకోగల అమ్మోనియంతో తయారు చేసిన ఓ రకమైన గులాబీ ఎరువుల పొడిని హెలికాప్టర్ల ద్వారా ఇంటి కప్పులపైనా, పక్కనున్న పొదలపైన, కార్లపైన చల్లుతున్నారు. ఈ పౌడర్‌లో అమ్మోనియంతోపాటు డైఅమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది మంటలు వ్యాపించకుండా ఉంటుందని, అయితే ఘాటైన వాసన కలిగిన ఈ పౌడర్ వల్ల శ్వాస ఇబ్బందులు, చర్మంపై దద్దులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌడరుకు దూరంగా ఉండే వాళ్లకన్నా పౌడరు చల్లే వారు, వాటిని మోసుకొచ్చే వారికే ఈ ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తులై తగిన సూచనలు చేశారు. కార్లపైన, వాహనాలపైన పడిన గులాబీ పౌడరును నీటితో డైల్యూట్ చేసి, డిటర్జెంట్, బ్రష్‌లు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని, ఆ సందర్భంగా చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, కాళ్లకు జారిపోని బూట్లను ధరించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి 220 డాలర్ల జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. మంటల నుంచి నివాస ప్రాంతాలను రక్షించడం కోసం మంగళవారం అమ్మోనియంతో కూడి గులాబీ పౌడర్‌ను చల్లామని, ఇదే విష పదార్థం కాదని రూరల్ ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి ఇన్స్పెక్టర్ బెన్ షెపర్డ్ మీడియాకు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చని అన్నారు. ఈ పౌడరు బారిన పడిన వారు నీళ్లతో ఒళ్లంతా శుభ్రం చేసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రతించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పర్యావరణ కార్యకర్త ఎరిన్ బ్రొకోవిచ్ హెచ్చరిస్తున్నారు. -
అమ్మోనియం ప్రభావంతో చేపల మృతి
ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నం పంచాయతీ కాలవమూల కండ్రిగలో సాగులో ఉన్న చేపలు మృతి చెందాయి. దీంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు..మండలంలోని కుడితిపాళెంకు చెందిన మెట్టా సుబ్బారెడ్డి కాలవమూల కండ్రిగలో 12 ఎకరాలు చేపల గుంతలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడి దశలో ఉండగా నీటిలో అమ్మోనియా శాతం పెరిగి ఆక్సిజన్ అందక గుంతలో మొత్తం చేపలు చనిపోయాయి. రొయ్యల సాగు రైతులకు మాత్రమే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యేవి. ప్రస్తుతం చేపల చెరువులో కూడా ఇలాంటి పరిస్థితి ఉండటంతో చేపల సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆందోళన కలిగిస్తున్న అమోనియం లీకేజీ
జక్రాన్‌పల్లి,న్యూస్‌లైన్: ద్రవరూపంలో ఉన్న లిక్విడ్ అమోనియాన్ని తీసుకెళ్తూ ఓ ట్యాంకర్ మూడు రోజుల కింద జక్రాన్‌పల్లిలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్యాంకర్లో నుంచి ద్రవరూపంలో ఉన్న లిక్విడ్ అమోనియం లీకై వాయురూపంలోకి మార డం తో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ అమోనియం వాసనకు కళ్లు తిరుగుతూ వాంతు లు చేసుకుంటున్నామని ఇందిరానగర్ కాలనీవాసులు ఆరోపించారు. ట్యాంకర్‌ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని కోరారు.అమోనియం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, నష్టపరిహారం ఇప్పించాలని రైతులు మండల అధికారులను కోరారు. రైతులకు పరిహారం చెల్లించే వరకు ట్యాంకర్‌ను ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.నర్సయ్య అధికారులను డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని డిచ్పల్లి సీఐ శ్రీధర్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ట్యాంకర్లో పూర్తిగా నీటిని నింపామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎస్సై రవి తెలిపారు.ద్రవ రూపం లో ఉన్న అమోనియం పూర్తిగా వాయురూపంలోకి మారిపోయిందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి అపా యం ఉండద ని హెల్త్ సూపర్వైజర్ సాల్మన్ అన్నారు. వాసనకు కొంత ఇబ్బంది పడుతున్నారని, వేడి చేసిన నీటిని ఎక్కువగా తాగాలన్నారు.క ళ్లు మండితే మంచి నీళ్లతో కడుక్కోవాలని సూచించారు. గ్యాస్ గాలిలో కలిసిపోయినందున ఇప్పుడు చేయాల్సింది ఏమి ఉండదన్నారు.ట్యాంకర్ దగ్గర్లలోని ఇళ్లలో ఉండే కాలనీవాసులు ఇంటి కిటీకీలు పూర్తిగా మూసి వేయకూడదన్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. మండల తహశీల్దార్ అనిల్‌కుమార్,ఎంపీడీవో పీవీ శ్రీనివాస్ రోజంతా సంఘటన స్థలంలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో లిక్విడ్ అమోనియం లీకేజీ కారణంగా దెబ్బతిన్న పంటలను సోమవారం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు పరిశీలించారు. లిక్విడ్ అమోనియం వాయు రూపంలో వెలువడి గ్రామస్తులు ఇబ్బందులు పడడమే కాకుండా పంటల రంగు మారింది. ట్యాంకర్ నిలిపి ఉంచిన ప్రాంతంలోని పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బత్నిన పంటలను ఎమ్మెల్యే మండవ పరిశీలించారు. అధికారులతో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.