amritha fadnavis
-
నన్నెందుకు బ్లాక్ చేశారు : నటి ఫైర్
ముంబై పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో తనను బ్లాక్ చేయడంపై బాలీవుడ్ నటి పాయల్ రోహత్గి విమర్శలు గుప్పించారు. ఓ హిందువుగా హిందుస్థాన్‌లో ఉండాలంటే భయం వేస్తోందన్నారు. ఈ మేరకు... ‘ ముంబై పోలీసులు నన్నెందుకు బ్లాక్ చేశారు? డ్రగ్ కేసులో జైలుకు వెళ్లిన, మైనారిటీ ట్యాగ్ వేసుకున్న నటుడికి మీరు బెస్ట్‌ఫ్రెండా ఏంటి? పోలీసులే ఇలా పక్షపాత ధోరణితో ఉంటే ఒక హిందువుగా హిందుస్థాన్‌లో బతకాలంటే భయంగా ఉంది. హిందువుల కోసం వారి గురించి మాట్లాడవద్దని నా కుటుంబ సభ్యులు ఎందుకు పదే పదే చెబుతారో నాకు ఇప్పుడే అర్థమైంది’ అంటూ ప్రధాని, హోం మంత్రి కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తీరు పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ పాయల్‌కు అండగా నిలిచారు. ‘ తమ భావాలను పంచుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రభుత్వంలో భాగమైన, ప్రభుత్వ సంస్థలు సామాన్య పౌరులను ఈ విధంగా నిషేధించడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ముంబై పోలీస్ సోషల్ మీడియా టీం...‘ మేడమ్..ముంబై పోలీసులు పౌరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మీరు మాతో ఎల్లప్పుడూ కాంటాక్ట్‌లో ఉండవచ్చు. ముంబైకర్లను మేమెన్నడూ నిషేధించలేదు. మీకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా టెక్నికల్ టీం ఇందుకు గల కారణాలు అన్వేషిస్తోంది’ అని వివరణ ఇచ్చింది. Why has @MumbaiPolice blocked me 🧐 ? Are U BFF with drug accused jailed minority tag actor 🤨As a #Hindu I am scared to live in Hindustan if Police has such baised behaviour. Now I understand why my family tells me 2 stop talking 4 Hindus😡 @Sangram_Sanjeet @PMOIndia @HMOIndia pic.twitter.com/dhYmCFM3RC — PAYAL ROHATGI & Team -BHAKTS of BHAGWAN RAM (@Payal_Rohatgi) July 11, 2019 -
నేపథ్య గాయనిగా సీఎం సతీమణి
ఆమె స్వయానా ఓ ముఖ్యమంత్రి భార్య. పేరు అమృతా ఫడ్నవీస్. ఇప్పుడు ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'జై గంగాజల్' అనే సినిమాలో నేపథ్య గాయని అవతారం ఎత్తారు. అవును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఈ సినిమాలో ఓ పాట పాడారు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ భక్తి పాట పాడారు. అయితే, దీనికి గానీ.. మరే ఇతర గాన కార్యక్రమాలకు గానీ తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, వాళ్లు ఇస్తామన్నా అంగీకరించలేదని అమృత చెప్పారు. సలీమ్ సులేమాన్ అందించిన స్వరాలు, మనోజ్ ముంతాషిర్ రాసిన పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అవి పాడుతున్నంత సేపూ తాను మైమరచిపోయానని అమృత తన అనుభవాన్ని వివరించారు. ఈ ఆఫర్ వచ్చేసరికి తాను మరో సినిమాలో పాట పాడుతున్నానని, తాను ఆ పాట పాడుతుండగా విన్న ప్రకాష్ ఝా.. ఆయన సినిమాలో పాటకు తన గొంతు సరిపోతుందని భావించి అడిగారని తెలిపారు. ఒకటిన్నర రోజులో రికార్డింగు పూర్తయింది. తన భర్త, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన పాటను ఎంతగానో మెచ్చుకున్నారని.. జై గంగాజల్ సినిమా మహిళా కేంద్రీకృతంగా ఉంటుందని ఆమె అన్నారు. అమృత స్వతహాగా బ్యాంకర్. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగానే ఆమె తన కుమార్తె దివిజతో కలిసి ముంబైకి మారిపోయారు.