anand sarma
-
రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దుమారం
-
రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దుమారం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు మరోసారి రాజ్యసభలో దుమారాన్ని లేపింది. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ సోమవారం సభలో బిల్లు అంశాన్ని సభలో ప్రస్తావించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బిల్లు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. సభ్యుడి హక్కులను కాలరాసిందని ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. వచ్చే శుక్రవారం రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే బిల్లును వచ్చే శుక్రవారం చర్చించడం వీలుకాదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ బీజేపీ కావాలనే కేవీపీ ప్రైవేట్ బిల్లును అడ్డుకుంటోందన్నారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొన్నా జీరో అవర్ కొనసాగింది. -
నరేంద్ర మోడీ అబద్ధాల కోరు
బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అబద్దాలకోరని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ మాదిరి రాష్ట్రమంటూ మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ గర్విష్టి అని, అతనికి జాతీయ దృష్టిలేదని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి యుపిఏ వస్తుందన్న ధీమాను ఆయన వ్వక్తం చేశారు.