టీటీడీకి మళ్లీ ‘ఆనంద్’ టీమ్
చెన్నై, సాక్షి ప్రతినిధి : టీటీడీ స్థానిక సలహా మండలి (చెన్నై) చైర్మన్, ఇతర సభ్యుల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. తిరుమలలో శనివారం నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్థానిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కే ఆనందకుమార్ రెడ్డితోపాటు ఇతర 17 మంది సభ్యులు మరో రెండేళ్లపాటూ అవే పదవుల్లో కొనసాగుతారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ డెరైక్టర్ జీ రాధాకృష్ణ, పీవీఆర్ కృష్ణారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, శ్రీ సిటీ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి, ఎస్ఎస్ సుదంతిరం, ఆర్ రాఘవన్, ఎం ప్రభాకరరెడ్డి, బీ మోహన్‌రావు, ఏ రమేష్, ఎన్ శ్రీకృష్ణ, ఈగా సీ వెంకటాచలం, ఎల్ సుధాకరరెడ్డి, వెంకటాచల ఒడయార్, ఏఎల్ శ్రీహరి, ఏవీఎస్ సత్యనారాయణ, ఎస్ కార్తికేయన్, శేఖర్‌రెడ్డి మండలి సభ్యులుగా కొనసాగుతారు.
రెండేళ్లలో నాలుగు లక్ష్యాలు: ఆనందకుమార్ రెడ్డిశ్రీవారి అనుగ్రహంతో దక్కిన మరో రెండేళ్ల పొడిగింపుకాలంలో మండ లి నిర్దేశించుకున్న నాలుగు లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నాను. ఏడు ఎకరాల విస్తీర్ణంలో కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, చెన్నైలోని ఆలయ పునర్ వ్యవస్థీకరణ, పాండిచ్చేరి, చెన్నై ఈసీఆర్ రోడ్డులలో కొత్త ఆలయాల నిర్మాణం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. కన్యాకుమారిలో ఆలయ నిర్మాణానికి టీటీడీ అంగీకరించి, 25కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. సముద్ర తీరంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మాణ స్థలం ఖరారైంది. ఈనెల 18వ తేదీన కన్యాకుమారిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
రెండు వారాల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. చెన్నై ఈసీఆర్ రోడ్డులో కొత్తగా గుడిని నిర్మిం చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. చెన్నై వెంకటనారాయణ్ రోడ్డులోని ఆలయాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది. పాండిచ్చేరిలో ఇరుకైన వీధిలో ఉన్న చిన్నపాటి ఆల యాన్ని తొలగించి సుమారు రెండు ఎకరాల్లో భారీ ఆలయాన్ని నిర్మించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యూరుు. శ్రీవారి కృప, టీటీడీ బోర్డు సహకారం, స్థానిక సలహా మండలి సభ్యుల తోడ్పాటుతో ఈ నాలుగు లక్ష్యాలను సాధించగలనని భావిస్తున్నాను అని చైర్మన్ ఆనంద కుమార్ రెడ్డి చెప్పారు.