రికార్డు 'యోగా' ప్రయత్నం..
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లోని అనంతపద్మనాభ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకుగాను ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపల్ దత్తాత్రేయరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 21న జరిగే యోగా దినోత్సవానికి పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 750 మందికిపైగా ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు హాజరు కానున్నారని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.