అంతరగంగలో నీటి ఎద్దడి: మహిళల ధర్నా
కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా అందిస్తోన్న మంచినీటి సరఫరాలను అధికారులు నిలిపివేయడంతో గ్రామానికి చెందిన మహిళలు సోమవారం మండల కేంద్రంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో తమ గ్రామానికి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారని, బిల్లులు చెల్లించలేదంటూ వాటిని ఆపేశారని, ఫలితంగా గడిచిన మూడు రోజులుగా దాహార్తితో అల్లాడుతున్నామని మహిళలు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిసరఫరా పునరుద్ధరించారని కోరుతున్నారు.