ఇదేం విచిత్రమో నాయనా...
–ఆనప పంట అంటే ఎలా ఉంటుంది
–వేరుశనగలో ఎండిన కాయలెలా బలుస్తాయి
–పట్టుపురుగులను ఎలా గూళ్ళుకడతాయి
–బోరువేయాలంటే ఎంత ఖర్చువుతుంది
–పొట్టేళ్ళను కట్టేసి సంరక్షిస్తారా
–వేరుశెనగ పంటపరిశీలనలో ఉపముఖ్యమంత్రి అనుమానాలు
పలమనేరు: దీన్నేమంటారు.. అది ఆనపపంటసార్.. ఆనపకాయలెలా ఉంటాయి, ఆపక్కన ఏందదీ సాలుపంట జొన్నసార్ ..అదెందుకు మధ్యలో వేశారు.. అదెలా పండుతుంది ఇలాంటి ప్రశ్నలతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. దీన్ని చూసిన సాధారణ జనం ముక్కునవేలేసుకున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని పెంగరగుంట వద్ద రైతు జానకీరామ్ పొలం వద్ద తనకొచ్చిన అనుమానాలు తీర్చుకున్నారు. ఇప్పటికే ఎండిన వేరుశెనగ కాయలు తిరిగి మామూలుగా ఎలా తయారవుతాయని అడిగారు.
దీనికి వ్యవసాయసాఖ ఆధికారులు విపులంగా తెలియజెప్పారు.బోరువేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎలాంటి మోటార్ అవసరం, ఎంత లోతులో నీళ్ళున్నాయి ఇలాంటి అనుమానాలతో ఆయన ప్రశ్నం వర్షం కురిపించారు. అనతరం నూనేవారిపల్లె వద్ద మల్బరీ తోటను చూసి ఇదేం పంటఅని అక్కడి సర్పంచ్ విజయ్ను అడిగారు. తాను పట్టుపురుగులు ఎలా ఉంటాయో చూడాలనడంతో పక్కనే ఉన్న చంద్రప్పగౌడు మల్బరీ షెడ్డుకు తీసుకెళ్ళారు. పట్టుపురుగులను గమనించిన ఆయన అశ్చర్యానికి గురైయ్యారు.
అనంతరం పట్టుగూళ్ళను పరిశీలించి పురుగు గూళ్ళలోకి ఎలా వెళ్ళిందని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడున్నవారు వివరించారు. షెడ్డు ముందు బక్రీద్కోసం పెంచుతున్న పొట్టేళ్ళను చూసి ఇలా కట్టిపెడితే వీటికెళా మేత అందుతుందని ప్రశ్నించారు. అక్కడే మేత పెడతామని రైతు వివరించాడు. మొత్తం మీద వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహణలేని ఉపముఖ్యమంత్రిని చూసిన రైతులు బిక్కమొఖం వేయాల్సివచ్చింది. ఇలాంటి వారిని పంటపరిశీలన పంపితే రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని రైతులు చెవులు కొరుక్కున్నారు. మొత్తం మీద ఆయన పర్యటన రైతులకెంతో మేలు చెసిందీగానీ ఇన్నాళ్ళకు సేధ్యం గురించి కొంత అవగాహణ పెంపొందించుకున్నారు.