పసిడి పోరుకు నీహారిక
►మరో నలుగురు కూడా
►ప్రపంచ జూనియర్ బాక్సింగ్
తైపీ: భారత అమ్మాయిలు తమ పంచ్ పవర్‌తో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. ఐదు విభాగాల్లో ఫైనల్‌కు చేరుకొని కనీసం ఐదు రజతాలను ఖాయం చేసుకున్నారు. 70 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారికతోపాటు సోనియా (48 కేజీలు), సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పోరుకు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిహారిక పంచ్‌ల వర్షం కురిపించి తన ప్రత్యర్థి యు యువాన్ (చైనా)ను రెండో రౌండ్లో నాకౌట్ చేసింది. శనివారం జరిగే ఫైనల్స్‌లో అనస్తాసియా సిగయెవా (రష్యా)తో నీహారిక తలపడుతుంది.