ancient city
-
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ
నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్శిస్తుంటుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? ఏంటా నగరం అనే కదా!. వివరాల్లోకెళ్తే..కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నది పై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఐతే ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆర్కియాలజీ బృందంలోని డాక్టర్ ఇవానా పుల్జిజ్ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు. ఇరాక్ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్ తిరిగి నిండిపోక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బృందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్కియాలజీ బృందం ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది. (చదవండి: 20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి) -
కాశీ సాక్షిగా నవశకం
భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుంది. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలి. కాశీ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుంది. భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోం ది. ఈ చరిత్రకు సాక్షులం కావడం మన అదృష్టం. ► కాశీ ఆలయం గతంలో 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేది. ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. శివుడి రక్షణలోని కాశీ ఎన్నటికీ నాశనం కాబోదు. ► కాశీ విశ్వనాథ్ ధామం ఒక భారీ భవంతి మాత్రమే కాదు. దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడు. సాలార్ మసూద్ మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడు. మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడు. ఎన్నో కుతంత్రాలను తట్టుకుని కాశీ సగర్వంగా నిలిచింది. నవ చరిత్రకు సాక్షులం ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడు ► సాలార్ మసూద్ వస్తే రాజా సుహల్దేవ్ ఎదుర్కొంటాడు ► భారత్ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు ► దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక కాశీ ► మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది ► కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం వారణాసి: భారతదేశ నాగరిక వారసత్వానికి, ఔన్నత్యానికి కాశీ నగరం గొప్ప ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి దాడులు, దౌర్జన్యకాండ చరిత్ర పుటల్లో చీటిక అధ్యాయాలుగా మిగిలిపోయాయనని అన్నారు. మన ప్రాచీన పవిత్ర నగరం కాశీ తన మహోన్నతమైన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కాశీ కర్మభూమి, జన్మభూమి అన్నారు. ప్రధాని మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శతాబ్దాల బానిసత్వం భారత్‌ను ఆత్మన్యూనతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్టమని చెప్పారు. ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడని, సాలార్ మసూద్(భారత్‌పై దండెత్తిన ముస్లిం) మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడని, మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడని అన్నారు. ఔరంగజేబు, సాలార్ మసూద్, వారెన్ హేస్టింగ్స్ లాంటి వాళ్లు కాశీని ధ్వంసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు సాగించారని, అన్నింటినీ తట్టుకొని నగరం సగర్వంగా నిలిచిందని చెప్పారు. సుల్తాన్లు వచ్చారు, పోయారు గానీ కాశీ మాత్రం స్థిరంగా నిలిచి ఉందని పేర్కొన్నారు. ఈ దేశం మట్టి మిగతా ప్రపంచం కంటే భిన్నమైనదని వివరించారు. తన ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హర హర మహదేవ్’ మంత్రాన్ని పఠించారు. అప్పుడప్పుడు స్థానిక యాసలో మాట్లాడుతూ ఆహూతులను ఆకట్టుకున్నారు. సనాతన సంస్కృతికి చిహ్నం రాణి అహల్యాబాయి కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించారని, సిక్కు రాజు రంజిత్ సింగ్ ఈ గుడి గోపురాలకు బంగారు పూత వేయించారని మోదీ గుర్తుచేశారు. కాశీ విశ్వనాథ్ ధామం కేవలం ఒక భారీ భవంతి మాత్రమే కాదని, దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం అని వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు సముద్రంలో వేలాది కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్, పేదల కోసం లక్షలాది ఇళ్లను భారత్ నిర్మించుకుంటోందని, పరిశోధకులను అంతరిక్షంలోకి పంపిస్తోందని తెలిపారు. బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశ్వనాథ్ ధామం పాత, కొత్తల మేలు కలయిక అని అన్నారు. మన శక్తిసామర్థ్యాలకు ఈ ధామం ఒక సాక్షిభూతమని, గట్టి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని వివరించారు. సృజనాత్మకతకు పదును పెట్టండి భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదని మోదీ తేల్చిచెప్పారు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ (ఆత్మనిర్భర్) భారత్ కోసం ప్రయత్నాలు కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలన్నారు. నమామి గంగా మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు. భారత్ ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వం కింద మగ్గిపోయిందని, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఫలితంగా మన సృజనపై మనం నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో సృజనాత్మకతకు పదును పెట్టాలని ప్రజలకు సూచించారు. త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నామని, మరో 25 ఏళ్ల తర్వాత (100వ స్వాతంత్య్ర దినోత్సవాల నాటికి) ఇండియా ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అందుకోసం ఇప్పటినుంచి కృషి చేయాలని పేర్కొన్నారు. కాశీకి శివుడే రక్షణ కాశీ విశ్వనాథ ఆలయాన్ని భారీగా విస్తరించామని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో ఈ ఆలయం 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేదని, ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని చెప్పారు. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చని అన్నారు. శివుడి రక్షణలో ఉన్న కాశీ నగరం ఎన్నటికీ నాశనం కాబోదని వ్యాఖ్యానించారు. మోదీకి తలపాగా బహూకరణ మోదీ రాకతో వారణాసి సందడిగా మారింది. హర హర మహాదేవ్, మోదీ మోదీ అని నినదిస్తూ జనం ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లారు. కాలభైరవ మందిరం వద్ద కారులో ఉన్న మోదీ దగ్గరకు వచ్చేందుకు ఓ బ్రాహ్మణుడు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన మోదీ చేతులు ఊపారు. దీంతో భద్రతా సిబ్బంది సదరు బ్రాహ్మణుడిని అనుమతించారు. ఆయన మోదీకి గులాబీ రంగు తలపాగా, కాషాయం రంగు అంగవస్త్రాన్ని బహూకరించారు. మోదీ కటౌట్లు, పోస్టర్లతో కాశీ వీధులు నిండిపోయాయి. గంగా హారతి తిలకించిన ప్రధాని మోదీ 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి సోమవారం సాయంత్రం గంగా నదిలో ఓడపై విహరించారు. ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్ వద్ద ఆగి, గంగా హారతిని తిలకించారు. కూలీలపై పూలవర్షం కాశీ విశ్వనాథ్ ధామం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వినమ్రంగా చేతులు జోడించి అభివాదం చేశారు. వారిపై పూల రేకులు చల్లారు. కూలీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం వారితోపాటు కూర్చొని ఫొటో దిగారు. విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు సోమవారం ఉదయం కాశీకి చేరుకున్న మోదీ కాలభైరవ ఆలయంలో(కాశీ కా కొత్వాల్) ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసేందుకు స్వయంగా కలశంలో గంగా జలాన్ని సేకరించారు. ఆలయానికి చేరుకొని విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ్ ధామ్ ప్రాంగణంలో భారతమాత, మహారాణి అహల్యాబాయి హోల్కర్, ఆది శంకరాచార్య విగ్రహాలను అధికారులు ఏర్పాటు చేశారు. ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వేలాది మంది మత గురువులు, సాధువులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారణాసిలో కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని మోదీ భరతమాత విగ్రహానికి నమస్కరిస్తూ.. -
ఖమ్మం జిల్లా ప్రాచీన నామమేదో తెలుసా?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లా. ఈ జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఈ ప్రాంతం వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూబాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేర్వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు నగరంలోని నృసింహాద్రి అని పిలవబడే నారసింహాలయం నుంచి వచ్చినట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతిస్తంభం అని అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచ్చినట్లు మరో వాదన ఉంది. (చదవండి: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..) నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. పర్యాటక ప్రాంతాలివే.. జిల్లాతోపాటు ఖమ్మం నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. నగరంలో నరసింహస్వామి ఆలయం, శ్రీజలాంజనేయ స్వామి ఆలయం, లకారం చెరువు, దానవాయిగూడెం పార్కు, తీర్థాల సంగమేశ్వర స్వామిఆలయం, లకారం పార్క్, ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531 ఏడాదిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపున రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. (చదవండి: ఆ పంట సాగుచేస్తే రైతు బంధు, రైతు బీమా కట్.. కేసీఆర్ కీలక ఆదేశాలు) -
2000 సంవత్సరాల కిందటి పట్టణం!
బీజింగ్: చైనాలో అతి పురాతన పట్టణం బయటపడింది. 2000 ఏళ్ల కిందటి చిన్నపాటి నగరంలాంటిదాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు బయటకు తీశారు. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ అనే పురాతన ప్రాంతంలో రెండువేల ఏళ్ల కిందటే ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగిన పట్టణం ఉందని అక్కడి సిటీ కల్చరల్ అండ్ ఆర్కియాలజీ ఇనిస్టిట్యూట్ గుర్తించింది. జూలై 2016 నుంచి హునాన్ జిల్లాలోని కింగ్జువాంగ్జి అనే నగరానికి సమీపంలోని షెన్యాంగ్ అనే ప్రాంతంలో 500 స్క్వేర్ మీటర్లు తవ్వకాలు జరిపారు. అందులో పురాతత్వ శాస్త్రవేత్తలు ఇంటి నిర్మాణాలు, సెల్లార్లు, యాష్ కుండీలు, సమాధులు గుర్తించారు. కుండపెక్కులు, కాంస్యవస్తువులు, రాగి వస్తువులు కూడా బయటకు తీశారు. వీటిని పరిశీలించిన వారు 2000 కిందటిదని కనిపెట్టారు.