రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్!
ఢిల్లీ, సాక్షి: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోంది. రిపబ్లిక్ డే కోసం శకటాల ఎంపికలో వైవిధ్యతను కనబర్చింది. రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్లే.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ శకటం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు సిద్ధమైంది.
దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను అందించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్యానికి తగ్గట్లుగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది.
డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం.. అదీ ఏపీ తరఫున తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేయబోతోంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా కనువిందు చేయనుంది జగనన్న విజన్‌ను ప్రతిబింబించే ఏపీ శకటం.